telangana: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 26.885 కేజీల గంజాయి లభ్యం !

సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్వే పొలీసులు ప్రత్యేక తనికీలు నిర్వహించారు.


Published Mar 05, 2025 12:25:00 PM
postImages/2025-03-05/1741157781_cr20250305tn67c7a49bec4ae.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యం వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్వే పొలీసులు ప్రత్యేక తనికీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా అనుమానంగా కనిపించిన ఓవ్యక్తి లగేజీని చెక్ చేశారు. అందులో దాదాపు 26.885 కేజీల గంజాయిని గుర్తించారు. అనంతరం బ్యాగ్ ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : secundrabad railwaystation police drugs

Related Articles