kidney: మీ చిన్న చిన్న తప్పుల వల్లే కిడ్నీ ప్రాబ్లమ్స్ !

ఈ మధ్య కాలంలో చాలా శాతం ఫెయిర్ నెస్ క్రీములు , పెయిన్ కిల్లర్స్, రూమ్ స్ప్రేలు, మంచి నీరును తాగకపోవడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటుగా కిడ్నీల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 


Published Mar 05, 2025 01:33:00 PM
postImages/2025-03-05/1741161887_kidney4.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆహారం జీర్ణం అయ్యే టైంలో ఎన్నో టాక్సిక్ పదార్ధాలు విడుదల అవుతాయి. అవి ఎప్పటికప్పుడు తొలగించి పూర్తి ఆరోగ్యాన్ని కాపాడడానికి కిడ్నీలు సహాయం చేస్తాయి. కాకపోతే ఎన్నో కారణాల వలన ఈ మధ్య కాలంలో చాలా శాతం ఫెయిర్ నెస్ క్రీములు , పెయిన్ కిల్లర్స్, రూమ్ స్ప్రేలు, మంచి నీరును తాగకపోవడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటుగా కిడ్నీల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 


* ఫెయిర్ నెస్ క్రీములు అతిగా వాడడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఇందులో వాడే హానికరమైన క్రీముల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. దీని వల్ల కిడ్నీలు పనితీరు తగ్గిపోతుంది.


* ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటారో కిడ్నీలకు రక్త సరఫరా జరగదు. దాంతో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 


* బరువు తగ్గాలనుకునేవారు మరియు జిమ్ కు వెళ్లేవారు వ్యాయామంతో పాటుగా ప్రోటీన్ కు సంబంధించిన సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే వాటిని ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ పనితీరు పై ప్రభావం పడుతుంది .


* అంతే కాదు కొంతమంది వెయిట్ లాస్ కోసం ఇప్పుడు ఆపిల్ సిడర్ వెనిగర్ కాని , ఆయిల్ కాని , ఇలా సరైన అవగాహన లేకుండా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలకు సమస్యలు వస్తాయి. నిజానికి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాని సరైన పధ్ధతిలో తీసుకోకపోతే ...మీ ఆరోగ్యంలో మొదట ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీలే. 


* అంతేకాదు మీకు కాని బీపీ ఉంటే ...ఫస్ట్ దానికి  టీట్మెంట్ తీసుకోవల్సిందే. ఎందుకంటే బీపీ ఎక్కువ గా ఉన్నవారిలో కిడ్నీ పెయిల్యూర్స్ చాలా ఎక్కువ . సో బీ కేర్ ఫుల్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news kidney-problems

Related Articles