Srisailam: మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. !

భక్తులు తెల్లవారి నుంచే  భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దర్శనానికి దాదాపు నాలుగు గంటల టైం పడుతుంది.


Published Dec 08, 2024 03:33:00 PM
postImages/2024-12-08/1733652210_srisailamtemple1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారి నుంచే  భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దర్శనానికి దాదాపు నాలుగు గంటల టైం పడుతుంది.


భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలలో అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.


భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచినీరు ఇస్తున్నామని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu temple devotional srisailam

Related Articles