MEGA STAR: చిరు ..సురేఖల పెళ్లి కార్డును చూశారా ?

చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న  అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం సమయానికి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు


Published Oct 09, 2024 12:20:00 PM
postImages/2024-10-09/1728456737_chiruwed1c3bab05acd.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిరంజీవి అనగానే ..తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయాల్సిన అవసరం లేదు. సీనియర్ నటుడు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ , కృష్ణ తర్వాత అందరూ ఎక్కువగా చెప్పుకునేది మెగాస్టార్ గురించే. చిత్ర సీమలో కోటి రూపాయిలు పారితోషకం తీసుకున్న హీరో. రీసెంట్ గా ఆయన డ్యాన్స్‌తో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కారు. వందల సంఖ్యలో పాటలకు తనదైన స్టయిల్‌లో డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను అలరించారు కూడా. అయితే రీసెంట్ గా చిరు  పెళ్లి కార్డు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. 


చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న  అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం సమయానికి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. కేవలం మూడురోజులు షూటింగ్‌కి బ్రేక్‌ తీసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చిరు చాలా సార్లు స్టేజ్ మీదే చెప్పారు. అప్పటి వెడ్డింగ్‌ కార్డ్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నది.


అప్పట్లో చిరు ఫొటోను కూడా వేశారు. ప్రస్తుతం వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ ను మెగా అభిమానులు తెగ వైరల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.200కోట్ల బడ్జెట్‌తో మేకర్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ . త్రిష , చిరు డబుల్ రోల్ చేస్తున్నారని టాక్ . 
 

newsline-whatsapp-channel
Tags : chiranjeevi viral-news movie-news wedding socialmedia

Related Articles