UGADI: ఉగాది అలా వచ్చిందని ఎవ్వరికి తెలీదు ...ఉగాది వెనుక రహస్యమిదే !

యోగనిద్రలో ఉన్న సమయంలో సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు దగ్గరకి వెళ్తాడు. అక్కడ ఉన్న వేదాలను చడీచప్పుడు అపహరించి జారుకున్నాడు.


Published Mar 29, 2025 10:59:00 PM
postImages/2025-03-29/1743269433_Ugadi20232.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు సంవత్సరాది ఎంతో ప్రత్యేకమైనది. ఉగాది పేరు చెప్పగానే పంచాంగ శ్రవణమే కాదు ...ఉగాది పచ్చడి అన్ని గుర్తొస్తాయి. కాని ఉగాది అసలు పుట్టిందో చూద్దాం.  పురాణాల ప్రకారం, సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ, సృష్టి చేయాలనే సంకల్పం బ్రహ్మదేవుడికి కలిగింది. అలా బ్రహ్మదేవుడు తన దివ్యశక్తితో సృష్టి కార్యం ప్రారంభించాడు.  ఇదంతా చేసి అలిసి పోయి యోగనిద్రలో ఉన్న సమయంలో సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు దగ్గరకి వెళ్తాడు. అక్కడ ఉన్న వేదాలను చడీచప్పుడు అపహరించి జారుకున్నాడు.


నిద్ర లేచి చూస్తే వేదాలు కనిపించవు. అయ్యో వేదాలు లేని సృష్టి...నిరాధారమైనది. వేదాలు జ్ఞానానికి, ధర్మానికి మూలం. అవి లేకపోతే సృష్టి క్రమం, జ్ఞానం, యజ్ఞయాగాదులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో బ్రహ్మ దేవుడు మహా విష్ణువును ప్రార్థించాడు. వెంటనే మత్స్యావతారం ధరించి ఆయన దివ్యశక్తితో సోమకుడిని నీటిలో వెతికి సోమకుడి జాడను కనిపెట్టాడు.


వేదాలను దొంగిలించి సోమకుడు, వాటిని తన దుష్ట కార్యాలకు ఉపయోగించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీ మహా విష్ణువు సోమకుడును అడ్డగించాడు. ఇద్దరి మధ్య భీకర యుధ్దం జరుుతుంది. విష్ణువు తన వేగం , శక్తితో రాక్షసుడితో పోరాడి అలిసిపోయేలా చేసి సంహరిస్తాడు. వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అందించాడు. సంతోషంతో బ్రహ్మా వెంటనే తిరిగి సృష్టిని ఈ వేదాలనసరించి మొదలుపెట్టారు. చైత్ర మాసంలోని మొదటి రోజున, అంటే శుక్ల పక్షంలోని పాఢ్యమి తిథి నాడు "చైత్రమాసే జగద్భహ్మే ససర్జ ప్రథమే" అంటూ బ్రహ్మ సకల జగత్తును సృష్టించాడు. ఆ రోజునే భూమి, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, జీవరాశులు అన్నీ ఆవిర్భవించాయని భక్తులు నమ్ముతారు. ఆ రోజును యుగానికి ఆదిగా పరిగణిస్తారు. 'యుగం' అంటే కాలచక్రం. కాబట్టి, ఆ రోజును 'యుగాది' అని పిలిచారు. కృష్ణావతారం ముగిసింది కూడా ఇదేనని  నమ్ముతారు. ఇలా యుగం మొదలైంది కాబట్టి ఉగాది పుట్టింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi

Related Articles