ఓ అక్కలూ. చెల్లెల్లూ. ఓ పెద్దమ్మలూ...ఇనుర్రి నామాట. ఇగో గిదే ఛాన్సు. మల్ల మల్ల రాదు గా ఛాన్సు. మీకు నెలకు రెండువేల ఐదొందలు రావాల్నంటె నేను చెప్పినట్లు శెయ్యుర్రి.
ఓ అక్కలూ. చెల్లెల్లూ. ఓ పెద్దమ్మలూ...ఇనుర్రి నామాట. ఇగో గిదే ఛాన్సు. మల్ల మల్ల రాదు గా ఛాన్సు. మీకు నెలకు రెండువేల ఐదొందలు రావాల్నంటె నేను చెప్పినట్లు శెయ్యుర్రి.
అగో...రేవంత్ సార్ ను సూడుర్రి. శీకట్లొస్తున్నడు. అంతకు ముందు ఫోట్వలు సూడుర్రి. దావోస్ ల కోట్లేస్కోని తిర్గిండు. కోట్లేస్కోని కోట్లకు కోట్లు, లచ్చల కోట్లు తెచ్చుంటడు సారు. సారు కత చూస్తంటె తేడాగున్నది. సప్పుడుజేకుంట పొయిండు గానీ. మీరైతె ఇడ్వకుర్రి. ఇప్పుడు పోతె మల్ల మల్ల అవకాశం రాదు. రేపు ఎన్నికలొస్తున్నయ్ గదా. పట్నాల్లున్నోళ్లంత సార్ ను రెండువేల ఐదొందల అడుగుర్రి. అట్లనే మొన్న చీరలు గూడ ఇయ్యలేదు గదా. గా చీరలు గూడ అడుగుర్రి. ఎన్నికలు ఒడ్శిపోతె అటే ఇగ. అప్పుడు గ్రామ పంచాయితీ ఎన్నికలప్పుడు ఊళ్లల్ల చీరలు పంచిర్రు. ఇప్పుడు పట్నాల్ల మున్సిపాలిటీ ఎన్నికలైతుంటె..పట్నాల్ల చీరలియ్యాలె గదా. మరి ఇయ్యకుంట ఓట్లకుపోతె గదేం న్యాయం. తీస్కోర్రుల్లా. వచ్చినప్పుడు వచ్చింది తీస్కోవాలె. అట్లనే వారం దినాలు మీటింగులు పెడ్తుండు సారు. అక్కడ గూడ అడుగుర్రి. గీ ఎన్నికలు ఒడ్శిపొయ్నయంటె..ఇగ కతమే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఐతయో కావోనట. మల్ల మూడేళ్ల నాడు రాజెవ్వలో రాకాసుడెవ్వలో ఎవ్వలు సూడొచ్చిర్రు. ఈన చేశ్న సక్కదనాల పరిపాలనకు మల్ల మల్ల ఓట్లేస్తమా అంటుర్రు జనాలు. ఇప్పుడే గట్టిగ నిలదియ్యకపోతె..మీతోని వాళ్లకు పనిగూడ ఉండదు. మీ ఇష్టం ఇగ. నెలకు రెండువేలంటె ఏమనుకుంటుర్రు. పోపులు పెట్టెల్నిండా డబ్బులు గల్ల గల్లమంటయ్. ఉప్పులు పప్పులకు ఇంటాయ్నను అడిగే అక్కెరే ఉండదు. ఇస్తమంటెనే గదా ఓటేశిర్రు. రెండేండ్ల సంది ఇయ్యకుంటె అడగొద్దా ఎట్ల.