శరీరం మొదటగా చిన్న చిన్న లక్షణాలు చూపిస్తాయి. తెలుసుకుంటే మనం బయటకు వచ్చేయొచ్చు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రీసెంట్ గా మారిన లైఫ్ స్టైల్స్ , ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలు పనితీరు..దెబ్బతినడానికి చాలా మందిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల పనితీరు దెబ్బతిని డయాలసిస్ వరకు వెళ్తున్నారు. అయితే శరీరం మొదటగా చిన్న చిన్న లక్షణాలు చూపిస్తాయి. తెలుసుకుంటే మనం బయటకు వచ్చేయొచ్చు.
కిడ్నీలు దెబ్బతిన్న వాటిలో మొదట కనిపించే ప్రాధమిక లక్షణం ...కాళ్లవాపు , ముఖం ఉబ్బిపోవడం కిడ్నీల పనితీరు దెబ్బతిని , శరీరంలో నుంచి ప్రొటీన్లు బయటికి వెళ్లిపోవడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
* ఉదయం నిద్రలేవగానే టాయిలెట్ కు వెళ్లినప్పుడు మూత్రం నురగలా రావడం కిడ్నీ సమస్య లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ఇది యూరిన్ లో ప్రొటీన్ పోతుంది. ఈ సమస్య కూడా చాలా తీవ్రమైనదే. కాని తెలుసుకొని మందులు వాడితే చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది.
* కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, లేదా మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు వంటివి ఏర్పడినప్పుడు మూత్రంలో రక్తం పడటం వంటి సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యూరిన్ లో బ్లడ్ పడడం లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి. ఎందుకంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలున్నాయి.
* మీరు ఎంత డైట్ లో ఉన్నా....అకస్మాత్తుగా బరువుతగ్గిపోవడం ..అంటే చాలా తగ్గిపోవడం ...ఆకలి లేకపోవడం కాని ...వికారంగా ఉండడం ..కారణం లేకుండా వాంతులు లాంటివి ఉంటే వెంటనే డాక్టర్లను కలవాలి.
* కిడ్నీల పనితీరు దెబ్బతింటే... శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు పేరుకుపోతాయని, ఇవి చర్మంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్కిన్ డ్రై అయిపోవడం లాంటివి జరిగితే ...వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.