కొంతమందికి చిన్న డస్ట్ తగిలినా రోజంతా తుమ్ములు , దగ్గులు అసలు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ రోజుల్లో వందలో 90 మందికి డస్ట్ అలర్జీలే. తమ్ములు , దగ్గులు ఇలా ఏదో ఒక అలర్జీ. కొందరికి పోలిన్స్..గడ్డినుంచి, పూలనుంచి ఎలర్జీలు వస్తాయి. కొన్ని రకాల కెమికల్స్ వాసన పీల్చినా ఎలర్జీలు వస్తాయి. కొంతమందికి చిన్న డస్ట్ తగిలినా రోజంతా తుమ్ములు , దగ్గులు అసలు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.
శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ యాక్టివేట్ పై ఈ డస్ట్ పార్టికల్స్ అటాక్ చేస్తాయి. ఈ డస్ట్ పార్టికల్స్ ను బయటకు పంపించాలంటే..శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. శ్లేష్మంలో వీటిని పెట్టి బయటకు పంపించాలి. ఈ కఫం రావాలంటే దగ్గు రావాలి. కొంతమందికి ఈ కఫం ఎక్కువ తయారైతే పిల్లికూతలు ...మరీ ఎక్కువై ఆస్థమా కూడా వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయ్యి ఈ డస్ట్ ను అంతా బయటకు పంపేందుకు చేసే చర్య అలర్జీ.
ఈ డస్ట్ లోపలికి ఎక్కువగా వెళ్లిపోయి ఇమ్యూన్ సిస్టమ్ బాగా సెన్సిటివ్ అయిపోయి అతిగా స్పందించాల్సి వస్తుంది. ఎక్కువ ప్రొడెక్షన్ వస్తుంది. తక్కువ ధుమ్ము లోపలికి వెళ్లినా..ఎక్కువ తుమ్మటాలు..ఎక్కువ ఎలర్జీతో బాధపడతారు.
* ఎలర్జీల వల్ల తుమ్ములు ఎక్కువగా వస్తాయి..ముఖం ఎర్రగా అవుతాయి
* జలుబుతో కళ్లు ఎర్రగా అవుతాయి. ముఖం మీద దురదలు వస్తాయి.
* గొంతు అంత ఇరిటేషన్ గా ఉంటుంది.
ఎలర్జీలు వచ్చే వారికి ఉన్న కామన్ హ్యాబిట్ వాటర్ తక్కువగా తాగటం. మంచినీళ్లు తక్కువగా తాగేవారికి శరీరంలో ఉన్న నీటిని బయటకు పంపించకుండా, నీరు బయటకు పోకుండా ఆపడానికి..కొన్ని హిస్టమిన్స్ రిలీజ్ అవుతాయి..ఇవి ఎక్కువ రిలీజ్ అయితే..ఎలర్జీలు ఎక్కువగా వస్తాయి. నీరు తాగాలి.వేడినీళ్లతో ఆవిరి పట్టడం , తీపి పదార్ధాలు మానేస్తే దాదాపు ...మీరు ఎలర్జీ నుంచి విముక్తులు అయినట్లే.