ACIDITY: అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ తప్పులు అసలు చెయ్యకూడదు !

మనం చేసే చిన్న చిన్న తప్పుడు ఈ అసిడిటీని మరింత పెంచేస్తాయని చాలా తక్కువ మందికే తెలుసు.


Published Feb 24, 2025 08:22:00 PM
postImages/2025-02-24/1740408841_Shutterstock11852642410.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: లైఫ్ స్టైల్ మారిపోయింది. అసలు పొద్దున్న బాగా తిని ...రాత్రికి లైట్ గా తినాలి. కాని మనం రివర్స్ లో తింటున్నాం..పొద్దున్న లైట్ బ్రేక్ ఫాస్ట్ ...రాత్రికి అర్ధరాత్రి వరకు డిన్నర్ చేస్తూ ఉంటున్నాం మరి అసిడిటీ ఎందుకు రాదు. అయితే మనం చేసే చిన్న చిన్న తప్పుడు ఈ అసిడిటీని మరింత పెంచేస్తాయని చాలా తక్కువ మందికే తెలుసు.


* అసిడిటీ సమస్య ఉన్న వారు సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయ, ద్రాక్షపండ్లు), టమాటాలు, కారంగా ఉన్న ఆహారాలు, అధిక కొవ్వు లేదా జిడ్డు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 


* పొద్దున్నే చాలా మందికి నిమ్మకాయ వేడినీటిలో వేసుకొని తాగుతుంటారు. కాని ఇది చాలా పెద్ద తప్పు. ఇది గ్యాస్టిక్ ను పెంచేస్తుంది.


* అంతే కాదు చాక్లెట్, కార్బోనేటెడ్ పానీయాలు, కాఫీ, ఆల్కహాల్ వంటి వాటిని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. 


* యాసిడిటికి చెక్‌ పెట్టే చిట్కాలు.. ఇంగువ కలిపిన నీటిని తీసుకుంటే పుల్లని తేన్పులు, కడుపునొప్పి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


* పుదీనా ఆకులను నమిలినా ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది, పుల్లని తేన్పులను, గ్యాస్, అసిడిటీని తగ్గిస్తుంది.


*  అల్లం ముక్కలు కూడా అసిడిటీ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu healthy-food-habits fatyacids lemons

Related Articles