Alluarjun: బన్నీని చూస్తే మెగా ఫ్యామిలీకి మండుతోందా..నిహారిక ఏమంటుందంటే.?

అల్లు అర్జున్ ఈయన మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలా బ్రతకడు. మిగతా వారంతా మెగా హీరోల కనుసనల్లోనే, మెగా హీరోలం అంటూ చెప్పుకుంటూ బ్రతుకుతారు.


Published Jul 31, 2024 01:00:18 AM
postImages/2024-07-31/1722405433_bunny.jpg

న్యూస్ లైన్ డెస్క్: అల్లు అర్జున్ ఈయన మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలా బ్రతకడు. మిగతా వారంతా మెగా హీరోల కనుసనల్లోనే, మెగా హీరోలం అంటూ చెప్పుకుంటూ బ్రతుకుతారు. కానీ అల్లు అర్జున్ అలా కాదు చాలా డిఫరెంట్ గా తన సొంత ఇమేజ్  ఏర్పాటు చేసుకొని మెగా ఫ్యామిలీ అనే పేరు లేకుండా  అల్లు ఫ్యామిలీ అంటే ఏంటో నిరూపించాడు.

అలాంటి మెగా ఫ్యామిలీతో  అల్లు అర్జున్ ఎక్కువగా మింగిల్ అవ్వడు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.  అంతేకాదు మొన్నటి ఏపీ  ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారనే టాక్ వినిపించింది. అంతేకాకుండా నాగబాబు కూడా ఆయనపై సీరియస్ గా ట్విట్ చేశారు. ఇవన్నీ నడుస్తున్న తరుణంలోనే  మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ విభేదాల కారణంగా విడిపోయారని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా బయట ఎన్నో అపోహలు ఉన్న తరుణంలో   పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి అల్లు ఫ్యామిలీ రాకపోవడం  వారి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని అందరికీ  క్లారిటీ వచ్చింది. అయితే ఈ వివాదంపై తాజాగా నాగబాబు కూతురు నిహారిక స్పందించారు. మానవునిగా జన్మించిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి.

అల్లు అర్జున్ ఆయన అభిప్రాయం ప్రకారం ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన వ్యక్తిగత విషయం.  కానీ మాకు మా బంధుత్వాలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు, మా మధ్య సఖ్యత గానే ఉంది. మా ఫ్యామిలీలో ఎవరిని ఎవరు వ్యతిరేకించరు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan mega-family allu-arjun niharika committee-kurrallu-movie

Related Articles