మన ఇండియాలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం ఏ పనైనా చేస్తారు. శాస్త్రం ప్రకారం జీవితంలో లాభాలు, నష్టాలు అనేవి కాలం మారుతూ ఉంటే వాటితో
న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియాలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం ఏ పనైనా చేస్తారు. శాస్త్రం ప్రకారం జీవితంలో లాభాలు, నష్టాలు అనేవి కాలం మారుతూ ఉంటే వాటితో పాటే అవి మార్పు చెందుతాయి. అలాంటి మన జీవితంలో ఉదయం లేవగానే చాలా పొరపాట్లు చేస్తుంటాం. వాటి వల్లే మనం చేయాల్సిన లక్ష్యం చేరుకోలేక పోతామని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మార్నింగ్ లేవగానే ఈ కొన్ని పనులు చేస్తే, తప్పకుండా అనుకున్న లక్ష్య సాధన వైపు అడుగులు పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంటో చూద్దామా..
చాలామంది ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీద నుంచి డైరెక్ట్ గా కిందకు దిగుతారు. అలా కాకుండా కాలు కింద పెట్టేముందు ఓసారి భూదేవిని తలచుకోవాలట. ఎందుకంటే భూదేవి జీవిత కాలం మన భారాన్ని మోస్తుంది కాబట్టి ఆ తల్లిని తలుచుకుంటే అంతా మంచే జరుగుతుందట.
ఇక ఇదే కాకుండా ఉదయం లేచిన వెంటనే అగ్ని, మృదంగం, డబ్బు, బంగారం, వంటివి చూసి నమస్కారం చేసుకోవాలట. అయితే ఈ వస్తువులు ఎక్కువ బెడ్ రూమ్ లో పెట్టుకోరు కాబట్టి మీరు లేచిన వెంటనే ఏదైనా ఇష్ట దేవత విగ్రహాన్ని పడకగదిలో పెట్టుకొని చూస్తే ఆ రోజంతా మంచే జరుగుతుందని అంటున్నారు.
ఇదే కాకుండా ఉదయం లేవగానే మీ యొక్క తల్లిదండ్రుల నమస్కారం తీసుకోవాలని, అది మీ పిల్లలకు కూడా నేర్పించాలని అంటున్నారు. ఈ భూతల ప్రపంచంలో స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వారు మీ తల్లిదండ్రులే అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఉదయం నిద్ర లేచి ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలని అంటున్నారు. ఉదయం లేచిన తర్వాత ఒక దగ్గర కూర్చుని కనీసం ఐదు నిమిషాలు అయినా ధ్యానం చేయాలట. దీనివల్ల ఆరోజు మొత్తం పాజిటివ్ పెరిగి మీరు ఆరోగ్యంగా జీవిస్తారని అనుకున్న పనులు చేయగలుగుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.