Cardamom: యాలకులతో ఇలా చేస్తే భోగభాగ్యాలు మీ సొంతం.!

కొంతమంది వ్యక్తులు ఎంత కష్టపడినా కానీ  జీవితంలో సుఖపడలేరు. రూపాయి వెనకేసుకోవాలంటే కూడా వేసుకోలేరు.. అలాకష్టంతో పాటు వారు సంపాదించిన సంపాదన కూడా వృధా అవుతూ ఉంటుంది..  కష్టపడ్డ దానికి ఫలితం దక్కాలి 


Published Oct 07, 2024 08:03:26 AM
postImages/2024-10-07/1728268406_cardamom.jpg

న్యూస్ లైన్ డెస్క్: కొంతమంది వ్యక్తులు ఎంత కష్టపడినా కానీ  జీవితంలో సుఖపడలేరు. రూపాయి వెనకేసుకోవాలంటే కూడా వేసుకోలేరు.. అలాకష్టంతో పాటు వారు సంపాదించిన సంపాదన కూడా వృధా అవుతూ ఉంటుంది..  కష్టపడ్డ దానికి ఫలితం దక్కాలి అంటే తప్పనిసరిగా కొన్ని రెమెడీస్ పాటించాలని అంటున్నారు  పండితులు. దీనివల్ల మీరు కష్టపడ్డ దానికి కాస్త ఫలితం వచ్చినా ఫలితంలో కాస్త మిగులుబాటవుతుందట..

 మరి కష్టపడ్డ మీకు భోగభాగ్యాలు ప్రసాదించాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు ఈ రెమిడిని పాటిస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ శక్తి వస్తుందట. రెమిడిని కేవలం శుక్రవారం మాత్రమే చేయాలట.  దీనికోసం కొన్ని యాలకులు తీసుకోండి. అందులో రెండు కర్పూరం వేసి వెలిగించాలి. దీంట్లో నాలుగు యాలకులు వేయాలి. ఆ తర్వాత ఓం శీం అనే మంత్రాన్ని జపిస్తూ వాటిని పూర్తిగా కాల్చేయండి.  

బూడిద అయిన తర్వాత దాన్ని చిన్న పాత్రలో సేకరించి స్వచ్ఛమైనటువంటి నెయ్యిలో పోసి ఒక ముద్ద లాగా చేయండి. దాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పూజ గదిలో ఉంచుకోండి. మీరు ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానమాచరణ తర్వాత మీ కులదైవమైనటువంటి దేవుడికి దీపం పెట్టి ఆ బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఆ రోజు ఎలాంటి పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని ప్రారంభించకండి.

అది ఏదైనా సరే ఇట్టే నెరవేరిపోతుంది.  అలా మీరు సంపాదించే సంపాదన పెరిగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయట. స్త్రీ, పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న రెమిడీ పాటించి మీ జీవితాన్ని  బంగారు బాటలో నడిచేలా చేసుకోవాలని పండిత నిపుణులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line womens god cardamom cardamom-benifits

Related Articles