త్రిపుర రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీకి 50 మంది వరకు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు చాలా మంది సెలబ్రెటీస్ హాజరయ్యారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కి సింగర్ గా రాణిస్తుంది మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ . రీసెంట్ గా ఈమె బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు. తాజాగా తన బర్త్ డే పార్టీని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఇచ్చింది. ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీకి 50 మంది వరకు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు చాలా మంది సెలబ్రెటీస్ హాజరయ్యారు. ఇందులో 9 మంది గంజాయి వాడినట్లు రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చింది.
ఈ పార్టీలో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్వీటీ పోలీసులు దాడులు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో దాదాపు 40 మందికి గంజాయి టెస్ట్ చెయ్యగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ndps యాక్టు సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు కట్టారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ పార్టీలో డ్రగ్స్ , గంజాయి తో పాటు ఫారన్ మద్యం సీసాలు దొరికినట్లు సమాచారం. ఈ కేసులో అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీలో పాల్గొన్న దివి, కాసర్ల శ్యామ్. మరోవైపు త్రిపురా రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు.
నిజానికి ఈ గంజాయి వాడడం కూడా మంగ్లీ కి తెలిసిందా ..లేక తెలీకుండా జరిగిందా ఆలోచించాలి. మరోవైపు బర్త్ డే పార్టీని ఖరీదైన రిసార్ట్స్ లో ఇవ్వడం వెనక డ్రగ్స్ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.