ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారి కారణంగా తమకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
న్యూస్ లైన్ డెస్క్: గురుకుల టీచర్ అభ్యర్థులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలతో సహా వెళ్లి రేవంత్ రెడ్డి ఇంటిముందు నిరసన తెలిపారు. గురుకులాల్లో డౌన్‌మెంట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని కోరారు.
ఆ ప్రకారమే గురుకులాల్లో నియామకాలు చేపట్టాలని కోరుతూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారి కారణంగా తమకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.