RAJENDRA PRASAD: మా అమ్మ మరో సారి చనిపోయింది..రాజేంద్రప్రసాద్ !

. తన కూతురు మరణాన్ని దిగమింగుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి(38) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. 


Published Oct 08, 2024 01:42:00 PM
postImages/2024-10-08/1728375209_20241005035304mkmk.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏ తండ్రి కైనా ...కూతురు చాలా ముద్దు. మళ్లీ తన తల్లినే చూస్తాడు . తన అల్లరి భరిస్తాడు..ఆకతాయిగా ఉంటే ఓపిక గా సరిదిద్దుకుంటాడు. పిచ్చిగా ప్రేమిస్తాడు . అదే కూతురు తన కళ్ల ముందు చనిపోతే మాత్రం ..ఆ బాధను భరించలేడు. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ అదే బాధలో ఉన్నారు. తన కూతురు మరణాన్ని దిగమింగుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి(38) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. 


గాయత్రి ప్రొఫిషినల్ గా డాక్టర్ .. అయితే 38 యేళ్ల వయసులో హార్ట్ అటాక్ తో చనిపోయింది. గాయత్రి కి ప్రైవేట్ ఉద్యోగి రాజ్ కుమార్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో చాలా కాలంగా మాట్లాడలేదు కూడా. చాలా యేళ్లుగా మాట్లాడుకోలేదు . ఈ మధ్యే మాట్లాడుతున్నారు. ఇంతలో ఇలా జరిగింది. గాయత్రి అంత్యక్రియలు కేపీహెచ్‌బీలోని కైలాసవాసంలో ఆదివారం నిర్వహించారు. ఈక్రమంలో తన కుమార్తె మరణం రాజేంద్రప్రసాద్ తీవ్రంగా కలిచి వేసింది. 


దీంతో రాజేంద్ర ప్రసాద్ తనను పరామర్శించడానికి వచ్చిన వారితో 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది..పంపించేసి వస్తా' అని వారితో చెప్పారట .  కన్న కూతురు గుండెపోటుతో చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.. గాయత్రికి ఓ కూతురు ఉంది. ఆ చిన్నారి 'మహానటి' సినిమాలో జూనియర్ సావిత్రిగా నటించింది. ఒక్క సినిమాతోనే ఓ స్పెషల్ ఐడెంటి క్రియేట్ చేసుకుంది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ చాలా బాధపడ్డారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajendraprasad daughter died

Related Articles