రామ్ చరణ్  హీరోయిన్ కి   రెండో పెళ్లి..కొడుకు పుట్టిన తర్వాత కూడా.?

అమీ జాక్సన్  పాన్ ఇండియా లెవెల్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తనదైన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా పెళ్లి బంధంలో అడుగు పెట్టింది. హాలీవుడ్ నటుడు


Published Aug 26, 2024 11:29:26 AM
postImages/2024-08-26/1724651966_jockson.jpg

న్యూస్ లైన్ డెస్క్: అమీ జాక్సన్  పాన్ ఇండియా లెవెల్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తనదైన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా పెళ్లి బంధంలో అడుగు పెట్టింది. హాలీవుడ్ నటుడు అయినటువంటి హెడ్ వెస్ట్ విక్  అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కొత్త ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైంది అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 నిజానికి అమీజాక్సన్ గతంలో జార్జ్ పనియోటౌ బిజినెస్ మేన్ తో కొన్నాళ్లపాటు కలిసి జీవించింది. వీరిద్దరి కలయికకు ఆండ్రూ అనే ఒక కొడుకు కూడా పుట్టాడు. 2020లో అమీ జార్జ్ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇంతలోనే వారు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.  అయితే అమీ జాక్సన్ సౌదీలో జరిగినటువంటి ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో అడ్విస్ట్ విక్ ను మొదటిసారి కలిశారు.  

https://www.instagram.com/p/C_F_rNUK9KO/?igsh=MTlub3hieXV5eTNjNQ==

మొదటి చూపులోనే వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇంతలోనే ఈ జంట పెళ్లి బంధంలోకి కూడా అడుగు పెట్టింది. అమీజాక్సన్ తెలుగులో రాంచరణ్ తో ఎవడు సినిమాలో నటించింది అంతేకాకుండా ఐ, ఓ, తమిళ్ లో మిషన్ చాప్టర్ 1, క్రాక్ (హిందీ)లో నటించింది. ఈ విధంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో అమీజాక్సన్ పేరు మారుమోగిపోతుంది.  ప్రస్తుతం ఈమే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో వైరల్ గా మారాయి.

newsline-whatsapp-channel
Tags : news-line marraige, ramcharan vikram evadu edward-vek

Related Articles