Bus Stuck: వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. 10గంటలుగా బస్సులోనే


Published Sep 01, 2024 10:54:22 AM
postImages/2024-09-01/1725168262_IMG20240901104803640x400pixel.jpg

న్యూస్ లైన్  డెస్క్ : భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వేములవాడ నుంచి మహబూబాబాద్ కి శనివారం నాడు బయల్దేరిన ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకున్నది. వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య పారే వాగులోనే బస్సు నిలిచిపోయింది.

భారీ వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బస్సు వాగులోనే నిలిచిపోయింది. 10 గంటలుగా బస్సులోనే ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని ప్రయాణికులు కోరారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news rtc rains rain-alert cm-revanth-reddy tgsrtc cityrains

Related Articles