విడాకుల తర్వాత సమంతా, నాగచైతన్య రెండో పెళ్లి వార్తలతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య.. శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకోగా.. సమంతా కూడా అదే బాటలో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్ : విడాకుల తర్వాత సమంతా, నాగచైతన్య రెండో పెళ్లి వార్తలతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య.. శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకోగా.. సమంతా కూడా అదే బాటలో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. 2017లో వివాహం చేసుకున్న చైతూ, సమంతాలు.. 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు.
విడాకుల తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నారు. కాగా నాగచైతన్య మాత్రం శోభితతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆమెతో ఉన్న బంధాన్ని ఆగష్టు 8న జరిగిన నిశ్చితార్థంతో పెళ్లి బంధంగా మార్చుకున్నాడు. చైతూ పెళ్లిపై సమంతా ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్, స్పందన లేదు. కానీ.. తాజాగా ఓ వార్త టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ స్టార్ డైరెక్టర్ తో సమంతా రిలేషన్ షిప్ లో ఉందని.. ప్రచారం జరుగుతోంది.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజు నిడమోరుతో సమంతా డేటింగ్ లో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సమంతా నటిస్తున్న సిటాడెల్ సినిమా రాజు నిడమోరు దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది. కాగా.. ఈ సినిమా పూర్తి కాగానే రాజు నిడమోరు సమంతాతో ఎంగేజ్ మెంట్ కిప్లాన్ చేశారట. ఇప్పటికే పెళ్లైన రాజు త్వరలోనే తన భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని.. అందుకే ఈ పెళ్లికి సిద్ధమయ్యారనే టాపిక్ వైరల్ గా మారింది. అయితే.. సమంతా సరైన సమయంలో అక్కినేని ఫ్యామిలీకి బుద్ధి చెప్పిందని పలువురు సినీ విమర్శకులు కామెంట్ చేస్తున్నారు.