మన భారతదేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం అన్ని జరగాలని కోరుకుంటారు. అంతేకాదు వారి యొక్క రాశుల ప్రకారం బలాలు, బలహీనతలు ఏంటనేది తెలుసుకుంటూ
న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం అన్ని జరగాలని కోరుకుంటారు. అంతేకాదు వారి యొక్క రాశుల ప్రకారం బలాలు, బలహీనతలు ఏంటనేది తెలుసుకుంటూ ఉంటారు. ఆ విధంగానే బుధవారం రోజున ఈ రాశుల వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయట. మరి వారెవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి సెప్టెంబర్ 25 బుధవారం నుంచి ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తువులు, ఆభరణాలు పొందుతారు. కుటుంబంతో ఆనందంగా జీవించగలుగుతారు. ఏ పనిలో అయినా ధైర్యసహసాలతో ముందుకు వెళ్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంలో మిక్కిలి ఆనందంతో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి.
వృషభ రాశి:
వీరు ఏదైనా పనిచేసే దాంట్లో ఇబ్బందులు ఎదురైతే మాత్రం తప్పనిసరిగా వాటిని అధిగమిస్తారు. ఎలాంటి గౌరవ మర్యాదలకైన లోపం ఉండదు. వీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు తప్పనిసరిగా కలుగుతాయి. ఏ పనైనా ధైర్య సాహసాలతో ప్రారంభించి ముందుకెళ్తారు. ముఖ్యంగా ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగించే పనులు ఉంటే మాత్రం మానుకోవాల్సి ఉంటుంది. వీరికి ఏ వ్యాపారంగంలో అయినా సరే అధిక లాభాలు సంభవిస్తాయి.
మిథున రాశి :
ఈ రాశి వారు సెప్టెంబర్ 25 బుధవారం నుంచి అందరితో ఆనందంగా గడపాలి. ముఖ్యంగా స్నేహితులు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త పనులు ఇప్పుడే ప్రారంభించడం అంత మంచిది కాదు. మీరు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మీడియా రంగాల నుంచి అనేక అవకాశాలు మీకు లభిస్తాయి. ఏ అవకాశం వచ్చిన వదులుకోకుండా ముందుకు వెళితే అద్భుతమైన లాభాలు ఉంటాయి.
సింహరాశి:
ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభంతో పాటుగా స్థిరా, చర ఆస్తుల విషయంలో కూడా సమస్యలు క్లియర్ అవుతాయి. కొంతమంది తప్పుడు మాటలతో మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా అవి గమనించాలి. రాజకీయ రంగాల్లో రాణించాలనుకునే వారికి ఇది మంచి సమయం. మానసిక ఆందోళనలన్నీ తీసేయాలి. దైవ దర్శనం చేసుకొని భక్తిశ్రద్ధలతో ఉంటే హ్యాపీగా జీవిస్తారు.