health: భారత్ ను వణికిస్తున్న " ఫ్యాటీ లివర్ " !

కరెక్ట్ టైం లో కాని రియాక్ట్ అయితే పర్ఫెక్ట్ గా కాలేయాన్ని కాపాడుకోవచ్చు.


Published Jun 16, 2025 06:23:00 PM
postImages/2025-06-16/1750078474_101035756.cms

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ . ..నిజానికి భారత్ లో షుగర్ కేసులు ఎక్కువగా ఉండేవి. చాలా భయపట్టేవి కూడా ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అయితే, కొన్ని రాత్రిపూట లక్షణాల ద్వారా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కరెక్ట్ టైం లో కాని రియాక్ట్ అయితే పర్ఫెక్ట్ గా కాలేయాన్ని కాపాడుకోవచ్చు.


ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో రాత్రివేళ కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయ వాపు వల్ల కలిగే అసౌకర్యం లేదా శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడంలో కాలేయం విఫలమవడం వల్ల నిద్ర పట్టకపోవడం, మధ్యమధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో గ్లూకోజ్ ను మ్యానేజ్ చెయ్యడం కాలేయానికి కష్టంగా మారుతుంది.


రాత్రిపూట తీవ్రమయ్యే కడుపు నొప్పి: కుడివైపు పైభాగంలో కడుపులో అసౌకర్యంగా లేదా నొప్పిగా అనిపించడం ఫ్యాటీ లివర్ వ్యాధి సాధారణ లక్షణం.  ఎక్కువ అలిసిపోవడం కడుపు నొప్పి ...యూరిన్ కలర్ మారిపోవడం లాంటివి వెంటనే గమనించి డాక్టర్ ను కలవాలి. ఆకలి తగ్గుతుంది. అంతేకాదు మెదడు పనితీరు కూడా తగ్గుతుంది. కాళ్లు , పాదాలలో వాపు వస్తుంది. కాలేయ పనితీరు మందగించడం వల్ల శరీరంలో ద్రవాలు నిలిచిపోయి కాళ్లు , పాదాలలో వాపు రావచ్చు.   
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news india fatyacids

Related Articles