viral: పంజాబ్ గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుగు పాఠాలు !

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26 నుంచి వారం రోజుల పాటు సమ్మర్ క్యాంప్స్ జరిగాయి.


Published Jun 02, 2025 07:43:00 PM
postImages/2025-06-02/1748873721_teluguclassesfeat.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పంజాబ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుగు పాఠాలను చెప్తున్నారు. అసలు వాళ్లకెందుకు తెలుగు అంటారా  ..అదే తెలుసుకుందాం . కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని సర్కారీ బడుల్లో భారతీయ భాషా వేసవి శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పంజాబ్‌లోని ప్రభుత్వ బడుల్లో సమ్మర్ క్యాంప్స్‌ ఏర్పాటు చేశారు. ఆ క్యాంప్స్ లో పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. 


పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26 నుంచి వారం రోజుల పాటు సమ్మర్ క్యాంప్స్ జరిగాయి. వీటికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వీరికి యూట్యూబ్ లో చూసి తెలుగు వర్ణమాల నేర్పిస్తున్నారు. తెలుగులో కూరగాయల పేర్లు..పండ్లు , వంటకాలు ఇలా చాలా వాడుకపదాలను ఈ క్లాస్ లో నేర్చుకున్నారు పిల్లలు.


 తెలుగు భాషలోని నమస్కారం, ధన్యవాదాలు, అభినందనలు వంటి గౌరవపూర్వక పదాల గురించి ఉపాధ్యాయులు తెలియజేశారు. తెలుగు భాషలోని ప్రముఖ దేశభక్తి గేయాలను పంజాబీ విద్యార్థులతో చదివించారు. బస్సు మీద ఉన్నపేర్లు  ఎలా చదవాలి..మనకు మినిమమ్ కావాల్సిన ప్లేసులు ఎలా అడగాలి...ఇవే వారికి మెయిన్ సిలబస్. అయితే చాలా ఉపాధ్యాయసంఘాలు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నాయి. అయితే సొషల్ మీడియా మాత్రం ఈ చర్యను అభినందిస్తున్నారు. పిల్లలు రెండు మూడు బాషలు మాట్లాడడం చాలా బాగుంటుందని అంటున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu government-schools class-mates telugu punjab

Related Articles