పై ఫోటోలోని చిన్నారి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది..మామూలు అందం కాదు.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో  కొంతమంది స్టార్ నటీనటుల చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వారికి సంబంధించిన సినిమాలు వచ్చిన సమయంలో ఎక్కువ


Published Aug 17, 2024 01:43:22 AM
postImages/2024-08-17/1723873037_kavyathapar.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో  కొంతమంది స్టార్ నటీనటుల చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వారికి సంబంధించిన సినిమాలు వచ్చిన సమయంలో ఎక్కువ ప్రమోషన్స్ లో భాగంగా వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను వారి వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. ఈ పై ఫోటోలోని చిన్నారి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. చిన్నారి ఎవరు, ఇప్పుడు ఏం చేస్తోంది అనే వివరాలు చూద్దాం..

 పై ఫోటోలోని పాలబుగ్గలతో ఉన్న ఈ చిన్నారి తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపించింది. అలా మెల్లి మెల్లిగా ఎదుగుతూ ప్రస్తుతం హీరోయిన్ గా మారింది. అందం, అభినయంతో వరుస ఆఫర్లు తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరయ్యా అంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో  రామ్ సరసన నటించినటువంటి కావ్య థాపర్. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయినటువంటి ఈ సినిమా  నేపథ్యంలో ఈమె చిన్ననాటి ఫోటోలు, వీడియోలు, చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కావ్య థాపరుకు వరుస ఆఫర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ముంబై రాష్ట్రానికి చెందినటువంటి ఈ ముద్దుగుమ్మ కాలేజీ సమయంలోనే మోడలింగ్ రంగంలోకి వచ్చిందట. ఆ తర్వాత యాడ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2013లో తాత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిలింలో నటించింది. 2018లో ఈ మాయ పేరేమిటో  అనే చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చి , తర్వాత తమిళంలో కూడా చిత్రాలు చేసింది. తర్వాత స్టార్ హీరో విజయ్ ఆంటోని సరసాన బిచ్చగాడు2, రవితేజ హీరోగా ఈగల్ చిత్రాల్లో నటించి చివరికి రామ్ సరసన డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో  కథానాయకగా చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

newsline-whatsapp-channel
Tags : news-line childhood double-ismart-tariler kavya-thapar hero-ram

Related Articles