దంపతుల కలయిక తర్వాత ఇలా చేయాల్సిందే..లేదంటే డేంజరే.?

పెళ్లి అనగానే మూడు ముళ్ళు, ఏడడుగులు ఉంటాయి. ఈ తంతుతో మొదలైన పెళ్లి, పిల్లలు, కొత్త బంధుమిత్రులు  ఇలా అనేకం ఉంటాయి. వీటన్నింటిలోకెల్లా  దంపతుల మధ్య ఉండే బంధమే జీవితకాలం నిలబడుతుంది. వారి మధ్య బంధం నిలవాలంటే  వారి మనసులు, హావాభావాలు అన్ని కలవాలి. దీనితోపాటు  దాంపత్య జీవితంలో  లైంగిక సంతృప్తి కూడా ఒక భాగమే. లేకుంటే అస్సలు జీవితమే లేదు. అలాంటి లైంగిక  కలయిక సమయంలో  చాలామంది దంపతులు ఈ తప్పులు చేస్తూ ఉంటారు.


Published Jul 06, 2024 02:05:00 PM
postImages/2024-07-06/1720253487_rom.jpg

న్యూస్ లైన్ డెస్క్: పెళ్లి అనగానే మూడు ముళ్ళు, ఏడడుగులు ఉంటాయి. ఈ తంతుతో మొదలైన పెళ్లి, పిల్లలు, కొత్త బంధుమిత్రులు  ఇలా అనేకం ఉంటాయి. వీటన్నింటిలోకెల్లా  దంపతుల మధ్య ఉండే బంధమే జీవితకాలం నిలబడుతుంది. వారి మధ్య బంధం నిలవాలంటే  వారి మనసులు, హావాభావాలు అన్ని కలవాలి. దీనితోపాటు  దాంపత్య జీవితంలో  లైంగిక సంతృప్తి కూడా ఒక భాగమే. లేకుంటే అస్సలు జీవితమే లేదు. అలాంటి లైంగిక  కలయిక సమయంలో  చాలామంది దంపతులు ఈ తప్పులు చేస్తూ ఉంటారు.

దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. కలయిక సమయంలో దంపతులు చేసే ప్రధాన తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చాలామంది దంపతులు  కలయిక తర్వాత  డైరెక్ట్ గా నిద్రపోతూ ఉంటారు. అలా చేయకూడదట. ఆ పని పూర్తయిన వెంటనే  టాయిలెట్ కు వెళ్లాలని  వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల  బ్యాక్టీరియా అంతా  బయటకు వెళ్ళిపోతుందట.

అంతేకాకుండా  కలయిక అయిన వెంటనే  రహస్యభాగాలను నీటితో శుభ్రం చేసుకుంటే మరీ మంచిది అంటున్నారు. ఒకవేళ ఇలా చేసుకోకపోతే మీకు స్కిన్ ఎలర్జీ లాంటి  సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వారంటున్నారు. కానీ ఇందులో మరొకటి గమనించాలి.  శుభ్రం చేసుకోవాలి అంటే ఏదో షాంపూ, సబ్బు లాంటివి పెట్టి రుద్దడం కాదు,  జస్ట్ నీటితో శుభ్రం చేసుకుంటే  చాలని అంటున్నారు.

అంతేకాకుండా కలయిక పూర్తయిన వెంటనే  ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదంటే వాటర్ తాగడం మంచిదని తెలియజేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మూత్రం వస్తుందని, దానివల్ల ప్రైవేట్ భాగాల్లో ఉన్న బ్యాక్టీరియా ఏమైనా ఉంటే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుందని వారు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల కలయికలో అద్భుతమైన సంతృప్తిని పొందుతారని, ఆరోగ్యంగా జీవిస్తారని వైద్యులు తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wife-and-husbond kalaeika private-parts clean toilet

Related Articles