Devara: Ntr వేసుకున్న షర్ట్ ధర

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుందయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న 'దేవర' సినిమాకు సంబంధించిన రెండవ పాట  మానియా  నడుస్తోంది. ఈ పాట 


Published Aug 07, 2024 06:54:24 AM
postImages/2024-08-07/1723031122_chuttamallesong.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుందయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న 'దేవర' సినిమాకు సంబంధించిన రెండవ పాట  మానియా  నడుస్తోంది. ఈ పాట రిలీజ్ అయిన కొన్ని గంటలలోనే కోట్లాది వ్యూస్ సంపాదించుకుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈ సాంగ్ లో జాన్విఅందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అద్భుతమైన హాట్ అందాలతో పాటు ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మనల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు  అద్భుతమైన నటనతో ఈ చిత్రంలో నటించారని అర్థమవుతుంది. కేవలం సాంగే ఇంత మెప్పిస్తే సినిమా పూర్తిగా చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో అభిమానులు అనుకుంటున్నారు. ఈ మూవీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.

అలాంటి ఈ తరుణంలో 'చుట్టమల్లే' సాంగ్ లో తారక్ ధరించినటువంటి షర్టు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఈ షర్ట్ ను కొనుగోలు చేయడానికి  ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా వెతుకుతున్నారట.  దీంతో దేవర చిత్రంలో ఈ పాటలో ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర కేవలం 499 రూపాయలకే వస్తోంది.  ప్రస్తుతం ఈ షర్ట్ కొనడానికి ఎంతో మంది అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

 ఇదే తరుణంలో మన జూనియర్ ఎన్టీఆర్ నటనకే ఫ్యాన్స్ అయితే లక్షల రూపాయల షర్ట్ అవసరం లేదు. కేవలం 50 రూపాయల షర్టు వేసుకొని చేసిన సంచలనమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని మనస్తత్వంతో ఉంటారు.  ఏది వాడినా చాలా సింపుల్ గా ఉపయోగిస్తారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ కామర్స్ సైట్లలో ఈ షర్టు కూడా విపరీతంగా అమ్ముడవుతోందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara costly janhvi-kapoor chuttamalle-song

Related Articles