బాలీవుడ్ కింగ్ ఖాన్ కు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని 20 యేళ్ల కుర్రాడు బెదిరింపు కాల్స్ చేశాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాలీవుడ్ కింగ్ ఖాన్ కు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని 20 యేళ్ల కుర్రాడు బెదిరింపు కాల్స్ చేశాడు. సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీ , బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించాడు. ఈ నెల 25న బెదిరింపులు రాగా , జీషన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జీషన్, సల్మాన్‌కు ఫోన్ చేసి బెదిరించిన నిందితుడు మహమ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. నోయిడా సెక్టార్ 39లో తయ్యబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలిస్తున్నారు. అయితే రీసెంట్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ పై బెదిరింపు చర్యలకు పాల్పడడంతో ఇలాంటి కాల్స్ పై మరింత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో జీషన్ సిద్దిఖీని కాంగ్రెస్ బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన అజిత్ వర్గంలోని ఎన్సీపీలో చేరారు. హత్యకు గురైన ఆయన తండ్రి బాబా సిద్దిఖీ కూడా తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు. రీసెంట్ గా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపేశారు . అయితే బాబా సిధ్దికీ హత్య కేసుల పోలీసులు 15 మందిని అరెస్ట్ చేస్తారు. ఆయనను హత్య చేసింది బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.