యూపీఎస్సీ పరీక్షలో 551 వ ర్యాంకు సాధించాడు. ఆయనే మహారాష్ట్రలో అమ్గే గ్రామానికి చెందిన బీరప్పసిధప్ప డోని యూపీఎస్సీ లో 551 వ ర్యాంకు సాధించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇండియా పోస్ట్ లో ఉద్యోగం మానేసి యూపీఎస్సీ కోసం ప్రిపేయర్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. బీరప్ప సిధ్దప్ప డోని కుటుంబం , ఆ ఊరు సంబరాల్లో మునిగిపోయారు. ఓ గొర్రెల కాపరి కొడుకు అత్యంత యూపీఎస్సీ పరీక్షలో 551 వ ర్యాంకు సాధించాడు. ఆయనే మహారాష్ట్రలో అమ్గే గ్రామానికి చెందిన బీరప్పసిధప్ప డోని యూపీఎస్సీ లో 551 వ ర్యాంకు సాధించారు.
బీరప్ప యూపీఎస్సీ పరీక్షలు ఇంటర్వ్యూ అయిపోయినతర్వాత సెలవుల మీద తన బంధువుల ఇంటికి వెళ్లిన బీరప్ప సిద్ధప్ప.. బెళగావి సమీపంలోని నానావాడిలోని ఒక పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలో ఈ శుభవార్త అందుకున్నాడు. కర్ణాటక సీఎం సిధ్దరామయ్య స్వయంగా ఫోన్ చేసి బీరప్పకు ఈ విషయం తెలియజేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందంటున్నాడు బీరప్ప.
ఆయన తండ్రి సిద్ధప్ప, తల్లి బాలవ్వ, ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు సాంప్రదాయ హారతి ఇచ్చి, పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఆయనకు ఒక గొర్రె పిల్లను కూడా బహుమతిగా ఇచ్చింది. ఐపీఎస్ అధికారి అవ్వాలనేది తన కొడుకు కల అని దానికి తను ఎంత కష్టపడ్డాడో దేవునికే తెలిసని సంతోషాన్ని వ్యక్తం చేశారు.బీరప్ప ఇంజనీరింగ్ పూర్తి చేసి బి.టెక్ డిగ్రీ పొందాడు. తన అన్నయ్య లాగా భారత సైన్యంలో అధికారి కావాలనేది అతని కల. కానీ, పరిస్థితుల కారణంగా ఆ దిశగా ముందుకు సాగలేకపోయాడు. ఇండియా పోస్ట్ లో కొన్నాళ్లు చేశాక యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఉద్యోగం మానేశాడు.మొదటి రెండు ప్రయత్నాలలో యూపీఎస్సీలో విజయం సాధించలేదు. అయినా తన పట్టుదల వదులుకోలేదు. మూడో ప్రయత్నంలో బీరప్ప 551వ ర్యాంకు తెచ్చుకున్నాడు .అయితే, తన దరఖాస్తులో ఐపీఎస్ కావాలనేది తన కలగా పేర్కొన్నాడు.