సింధు నది పాకిస్థాన్ దే అని భారత్ చాలా సార్లు ఒప్పుకుంది. ఇప్పుడు ఏకపక్షంగా సింధు నది ఒప్పందాన్ని రద్దు చేశారు. సింధునది మాది మాకే సొంతం
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో దాడులకు ప్రేరిపిస్తున్న పాకిస్థాన్ కు చుక్క నీరు కూడా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా చాలా మంది నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సింధు నది నీరు ఆపేస్తే పాకిస్థాన్ ఎడారవుతుందంటు పాక్ ఓ లేఖ రాసిందట.
ఈ క్రమంలోనే అక్కడి నేతలు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా స్పందించారు. సింధు నది పాకిస్థాన్ దే అని భారత్ చాలా సార్లు ఒప్పుకుంది. ఇప్పుడు ఏకపక్షంగా సింధు నది ఒప్పందాన్ని రద్దు చేశారు. సింధునది మాది మాకే సొంతం. ఈ నదిలో నీరైనా ప్రవహిస్తుంది..లేదంటే రక్తమైనా ప్రవహిస్తుంది అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన " ది రెసిస్టెన్స్ ఫ్రంట్ " ఈ దాడికి బాధ్యత వహించింది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే కారణంతో భారత్ , సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందాన్ని సదుద్దేశంతో అమలు చేయలేమని పేర్కొంటూ పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖకు అధికారికంగా నోటీసు పంపింది.