ఫిజికల్ గా ఫిట్ గా లేకపోతే ...చాలా కష్టం. అసలే ఇప్పుడు హార్ట్ అటాక్స్ ..క్యాన్సర్లు దారుణంగా వస్తున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : లైఫ్ లో బద్దకం లేని వాళ్లు ఎవరు చెప్పండి. కాకపోతే బద్దకం స్థాయిని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ఎంతో పెద్ద సమస్యగా కనిపించకపోయినా దీర్ఘకాలికంగా ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైనా బద్దకంగా అనిపించినప్పుడు ఒకే ప్రదేశంలో ఉండిపోకుండా వాకింగ్ వంటివి చేయాలి. ఫిజికల్ గా ఫిట్ గా లేకపోతే ...చాలా కష్టం. అసలే ఇప్పుడు హార్ట్ అటాక్స్ ..క్యాన్సర్లు దారుణంగా వస్తున్నాయి.
ఎప్పుడైతే బద్ధకం పెరుగుతుందో సరైన టైం టేబుల్ అనేది పాటించాలి.
ఎప్పుడైతే చాలా సమయం ఏ పని చేయకుండా కూర్చుంటారో అప్పుడే బద్ధకం ఎక్కువ అవుతుంది.
ప్రతి మనిషి దాదాపు 35 నిమిషాలు వాకింగ్ తప్పనిసరి
మీ జీవన విధానంలో భాగంగా ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు మరియు బద్ధకం కూడా తగ్గుతుంది.
మీరు పొద్దున్నే లేచి ఒక పనిని కంటిన్యూ గా ఒక టైంలో ప్లాన్ చేసుకొండి. దీని వల్ల మీకు ఆ పని మీద కాన్సట్రంటేషన్ పెరుగుతుంది.
ఎంతో తక్కువ సమయంలో ఎటువంటి బద్ధకం లేకుండా పూర్తి చేయగలుగుతారు.