కొన్నివేల సంవత్సరాల క్రితం మార్స్ కూడా భూమి లాగే మార్స్ కూడా జీవరాశి చాలా అధ్భుతంగా ఉండేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చైనా జురాంగ్ రోవర్ చేసిన అధ్యయనం ప్రకారం అంగారక గ్రహంపై 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక తీరాలు కనిపించయంటున్నారు శాస్త్రవేత్తలు . అయితే ఇది ఒకప్పటి సముద్రమై ఉంటుందని అంచనా. అదే కాని నిజమైతే ..మార్స్ పై జీవరాశి బతకాడానికి అనువైన ప్రదేశం. కొన్నివేల సంవత్సరాల క్రితం మార్స్ కూడా భూమి లాగే మార్స్ కూడా జీవరాశి చాలా అధ్భుతంగా ఉండేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, అంగారక గ్రహాల ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. అధునాతన గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్‌తో అమర్చబడిన చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైన నీటిని కలిగి ఉండేదని ఈ పరిశోధన ఇప్పటివరకు అత్యంత దృఢమైన ఆధారాలను అందిస్తుంది.
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో భూగర్భ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయన సహ రచయిత అయిన బెంజమిన్ కార్డెనాస్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే గతంలో అంగారక గ్రహ వాతావరణం జీవానికి మరింత అనుకూలంగా ఉండేదని ఏ కారణాలతో ఇలా అయ్యిందనేది తెలీదు కాని గ్రహంపై సూక్ష్మజీవులు జీవం మనుగడ కొనసాగించి ఉండవచ్చు. ఈ తాజా పరిశోధన ప్రకారం.. అంగారక గ్రహం మనం అనుకున్నట్లు చల్లని, ఇసుక ప్రపంచం కాదని, బహుశా భూమి లాంటి వాతావరణాన్ని గతంలో కలిగి ఉండవచ్చని అన్నారు.