కొరియన్ డ్రామాలు వందశాతం ఎంగేజ్ చేస్తూ మంచి కిక్ ఇస్తున్నాయి. తెలుగు లో డబ్ అయిన ది బెస్ట్ కొరియన్ డ్రామాస్ ను సజెస్ట్ చేస్తాం
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కొరియన్ డ్రామాస్ అనగానే లేని ఇంట్రస్ట్ వచ్చేస్తుంది. కొరియన్ డ్రామాలు వందశాతం ఎంగేజ్ చేస్తూ మంచి కిక్ ఇస్తున్నాయి. తెలుగు లో డబ్ అయిన ది బెస్ట్ కొరియన్ డ్రామాస్ ను సజెస్ట్ చేస్తాం ...మీరు ఎంజాయ్ చేసేయ్యండి.
* బిజినెస్ ప్రపోజల్ ...ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇందులో షిన్ హా -రి అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ కోసం బ్లైండ్ డేట్ కు వెళ్లడానికి ఒప్పుకుంటుంది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి బాస్ డేట్ పార్ట్ నర్ ఆ అమ్మాయి కంగారు...ప్లాన్లు అన్ని భలే ఫన్నీ గా ఉంటుంది. ఈ సీరిస్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో చూపించారు.
* ద ఎటిపికల్ ఫ్యామిలీ ...ఈ నెట్‌ఫ్లిక్స్ డ్రామా సిరీస్ బోక్ గ్వి-జు అనే వ్యక్తి, ఆయన ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబ సభ్యులందరికి సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్స్ ..పొల్యూషన్, జమ్స్ వల్ల పవర్స్ తగ్గుతుంటాయి. అదే టైంలో డోడా -హే అనే అమ్మాయి వారి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ కుటుంబం జీవితం ఆమె రాకతో ఎలా మారుతుంది.సూపర్ డూపర్ ఎంటర్ టైనర్ .
* హ్యాపీనెస్ ....."నెక్స్ట్" అనే ఫెయిల్డ్ ట్రీట్‌మెంట్ డ్రగ్ విడుదల వల్ల "లైట్టా వైరస్" అనే ఒక ప్రపంచవ్యాప్త మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వారు పిచ్చిగా ప్రవర్తిస్తారు. రక్తదాహం పెరిగి జాంబీలా మారతారు. దక్షిణ కొరియా సైన్యం, పోలీసులు ఈ వైరస్, నెక్స్ట్ మందు వ్యాప్తిని అడ్డుకోవడానికి కృషి చేస్తారు. దక్షిణ కొరియా సైన్యంలో కఠినమైన నిర్భంధ చర్యలు అమలు చేస్తారు . ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.
* క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూఈ సిరీస్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమెన్ యూన్ సీ-రి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక సంస్థకు వారసురాలు. సియోల్‌లో పారాగ్లైడింగ్ ట్రిప్ సమయంలో, ఆమె తుఫానులో చిక్కుకుని ఉత్తర కొరియా సైనిక సరిహద్దులో క్రాష్ ల్యాండ్ అవుతుంది.అక్కడ ఆమెను రి జియోంగ్-హ్యోక్ చూస్తాడు. అతను ఉత్తర కొరియా సైన్యంలో కెప్టెన్, ఉత్తర కొరియా ఎలైట్ మెంబర్. ఆమెను దాచాలని, దక్షిణ కొరియాకు తిరిగి పంపించాలని నిర్ణయించుకుంటాడు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
* లవ్లీ రన్నర్ ...లవ్లీ రన్నర్ దక్షిణ కొరియా సిరీస్ టుమారో'స్ బెస్ట్ అనే వెబ్ నావెల్ ఆధారంగా రూపొందింది. డైరక్టర్ కావాలనుకున్న ఐం సోల్ అనే ఓ వ్యక్తి ప్రమాదంలో గాయపడుతుంది. ఆమె కలలు నెరవేర్చుకోవడం అసాధ్యంగా మారుతుంది.అయితే తను ఓ రకంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. ఆ టైం లో సింగర్ ర్యూ సన్-జే పాటలతో రిలీఫ్ పొందుతుంది.కానీ, అతను కూడా ప్రమాదంలో మరణిస్తాడు. అయితే సడన్ గా ఆమె 15 ఏళ్ల వయసుకు వెళ్లిపోతుంది. అది ఆమెకు దేవుడు ఇచ్చిన వరం. సన్-జే భవిష్యత్తు మార్చడానికి ప్రయత్నిస్తుంది. Rakuten Viki ప్లాట్‌ఫామ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
* క్వీన్ ఆఫ్ టీర్స్ ఈ 2024 సౌత్ కొరియన్ టీవీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీరిస్ లో హీరోయిన్ పెద్ద సంస్థకు వారసురాలు. ఆమె ధనవంతురాలైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. బేక్ హ్యూన్-వూ ఒక రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల జరిగే సమస్యలు అన్ని ఈ సీరిస్ లో ఉంటాయి.
* బిజినెస్ ప్రపోజల్ ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. షిన్ -హా- రి అనే అమ్మాయి తన స్నేహితురాలి కోసం బ్లైండ్ డేట్ కు వెళ్లడానికి అంగీకరిస్తుంది. ఆమె డేట్ పార్ట్ నర్ తన బాస్ అని తెలుసుకుంటుంది. తర్వాత జరిగే విషయాలే నెట్ ఫ్లిక్స్ సీరిస్.