Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర ..ఇప్పుడు గ్రాము ఎంతంటే !

ఇక ఢిల్లీలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 పెరిగి ఇవాళ ఉదయం నాటికి రూ.82,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.90,150గా ఉంది.


Published Mar 18, 2025 10:54:00 AM
postImages/2025-03-18/1742275531_1736574490goldrate1736313896.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం కొనడానికి ప్రయత్నిస్తున్నారా ..అయితే మీకు కాస్త బెడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.82,500 గా ఉంది.


అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో పసిడి ధర రూ.440 పెరిగి రూ.90,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సిటీల్లో ను ఇదే పరిస్థితి.  మేకింగ్ ఛార్జీలు ఏమైనా తేడా ఉంటే ఉండాలి కాని దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ఇదే ధర నడుస్తుంది.ఇక ఢిల్లీలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 పెరిగి ఇవాళ ఉదయం నాటికి రూ.82,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.90,150గా ఉంది. ముంబై లో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.82,500 గా ఉంది. అలాగే 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,000 గా ఉంది.


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది


విజయవాడలో కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది


విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది


ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది


ముంబైలో కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate stock-market

Related Articles