అసలు ఏ కెమికల్స్ లేకుండా నేచురల్ విధానాల ద్వారా చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కాశ్మీర్ ప్రకృతి అందాలు ఎంత బాగుంటాయో..అమ్మాయిలు కూడా అంత అందంగా ఉంటారు. అచ్చం మంచు లాగా..అసలు ఎందుకు కాశ్మీర్ ఆడపిల్లలు ఇంత అందంగా ఉన్నారనేది పెద్ద సీక్రెట్ . స్కిన్ చాలా క్లియర్ గా ..అందంగా ఉండడమే కాదు ..చాలా బ్రయిట్ గా మల్లెమొగ్గలా ఉంటారు. దీని కారణం నేచురల్ విధానాలే అంటున్నారు అందరు. అసలు ఏ కెమికల్స్ లేకుండా నేచురల్ విధానాల ద్వారా చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే.
* కశ్మీరీ ప్రజలు కుంకుమపువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చర్మానికి సహజమైన గులాబీ రంగును ఇవ్వడమే కాదు. కానీ ఇది ఫ్రీ రాడికల్స్ నుండి కూడా రక్షిస్తుంది.
* చల్లని ప్రాంతం కావడంతో వారికి టానింగ్ సమస్య ఉండదు. స్కిన్ కొంచెం ఫాస్ట్ గా రికింల్స్ త్వరగా రావు. చల్లని ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ల స్కిన్ చాలా ఫాస్ట్ డ్రై అవుతుంది. కాబట్టి వాళ్లు మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడుతుంటారు.
* కుంకుమపువ్వులో ఉండే యాంటీఆక్సిడెంట్ అంశాలు చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. దీన్ని పాలలో కలిపి దూది సహాయంతో ముఖానికి రాసుకుంటే కొన్ని రోజుల్లోనే ముఖం మెరుస్తుంది.
*బాదంలో ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, రాగి మరియు భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను లోపలి నుంచి రిపేర్ చేయడంలో సహాయపడతాయి.
*ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. కశ్మీర్ లో లభించే వెల్లుల్లి లో కూడా మంచి పోషకాలు ఉంటాయి . ఇందులో B1, B6, C చర్మం మరింత క్లియర్ గా ఉంటుంది.
* వెల్లుల్లి ఎక్కువ గా తీసుకోవడంలో మొటిమలకు చికిత్స చెయ్యడంలో సహాయపడతాయి. ఇది స్కిన్ మీద ఉండే ఎక్స స్ ఆయిల్ ను రాకుండా చేస్తుంది.
* వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి. దీని కోసం, వాల్‌నట్ పొడిని తేనె, రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు దీనిని ఫేస్ స్క్రబ్ లా ఉపయోగించి డెడ్ స్కిన్ ని తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.