Blood Rain:ఇరాన్ బీచ్ లో " రక్తపు వర్షం " బీచ్ అంతా ..రక్తం !


సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


Published Mar 13, 2025 12:32:00 PM
postImages/2025-03-13/1741849511_BloodRainTouristIranHormuzBeachViral17418219842131741821988038.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సాధారణంగా రెయిన్ బో  కాని వడగల్ల వర్షం కాని ..భలే థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. కదా ..అదే బీచ్ లో రక్తపు వర్షాలు కురిస్తే థ్రిల్లింగ్ లేదు పాడు లేదు..గుండె అదిరిపోతుంది.  రక్తపు వర్షమా ...ఆశ్చర్యపోకండి..ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తం లా ఎర్రని వర్షం కురిసింది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. అయితే కొంత మంది మాత్రం ఈ రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. 


సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిజానికి ఇది చాలా ఏళ్లుగా రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్నిపర్వతం ఉండేదని దాని నుంచి వచ్చిన లావా చల్లారి ఈ దీవి ఇలా ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. ప్రకృతి వింతల్లో ఇదొక ఉదాహరణ.


అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ చాలా అధిక మోతాదులో ఉంటుందని, వర్షపు నీరు రక్త వర్ణంలోకి మారడానికి కారణం ఇదేనని వివరణ ఇచ్చారు. చూడడానికి డేంజర్ లా కనపించినా ...అక్కడ చూడడానికి అంతా ఎర్రగా భలే అందంగా కూడా ఉంటుంది. 


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu beachroad blood-

Related Articles