ఇతర ఉత్పత్తులు మాత్రమే భారీగా అమ్ముడవుతున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జాతీయ ప్రధాన కార్యదర్శి, బిజెపి ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హోలీ కి వ్యాపారమా...ఏం జరుగుతుందనుకుంటాం..కాని సౌత్ లో ఏదో సరాదా పండగే అయినా ..నార్త్ లో హోలీ చాలా పెద్ద పండుగ. అయితే ఈ సారి వ్యాపారం మాత్రం భారతీయులు చైనా రంగులు ..కెమికల్ కలిపిన ఉత్పత్తులను బహిష్కరించారు. భారతదేశంలో తయారైన మూలికా రంగులు, గులాల్, పిచికారీలు, బెలూన్లు, గంధపు చెక్క, పూజా సామాగ్రి, దుస్తులు, ఇతర ఉత్పత్తులు మాత్రమే భారీగా అమ్ముడవుతున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జాతీయ ప్రధాన కార్యదర్శి, బిజెపి ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
అయితే హోలీ వ్యాపారంలో రంగులు మాత్రమే కాదు. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, పూలు, పండ్లు, బట్టలు, ఫర్నిషింగ్ ఫాబ్రిక్, కిరాణా, FMCG ఉత్పత్తులు, వినియోగ వస్తువులు మొదలైన అనేక ఉత్పత్తులకు మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేనా ప్రతి హోలీకి బట్టలు కొంటారు. వైట్ షర్టులు , వైట్ కుర్తా పైజామా , రంగులతో ఆడుకోవడానికి సల్వార్ సూట్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. హ్యాపీ హోలీ రాసిన టీ షర్టులయితే ఈ సీజన్ లో భారీగా అమ్ముడవుతాయి.
ఈ సంవత్సరం హోలీ పండుగ వ్యాపారులకు రూ. 60,000 కోట్లకు పైగా వ్యాపారాన్ని సృష్టిస్తుందని అంచనా. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే దాదాపు 20 శాతం ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం దాదాపు రూ.50వేల కోట్లు . ఢిల్లీ మార్కెట్ లో రూ.8 వేల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందనే అంచనాలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.