Breast feeding :తల్లి పాలు బిడ్డకు సరిపోవడం లేదా.... చిట్కాలు ఇవే !

తల్లి పాలు కరువైపోతున్నాయి. రోజు రోజుకు డబ్బా ఫీడింగ్ ఇచ్చే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువవుతుంది. అయితే ఇది తల్లి నిర్లక్ష్యం కాదంటున్నారు డాక్టర్లు .


Published Oct 24, 2024 10:19:00 PM
postImages/2024-10-24/1729788647_breastfeedingtipsfornewmomsmadisonwomenshealth.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తల్లి పాలు కరువైపోతున్నాయి. రోజు రోజుకు డబ్బా ఫీడింగ్ ఇచ్చే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువవుతుంది. అయితే ఇది తల్లి నిర్లక్ష్యం కాదంటున్నారు డాక్టర్లు . ఈ జనరేషన్ ఆడవారిలో పౌష్టికాహారం లోపం కారణంగానే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని క్లియర్ గా చెబుతున్నారు. 


కన్న బిడ్డకు తల్లిపాలు పట్టించడం చాలా అవసరం. తల్లి పాలు తాగడం వల్ల పుట్టిన బిడ్డ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక బిడ్డకు కనీసం ఆరు నెలలు నిండే వరకైనా తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొంత మంది స్త్రీలకు బిడ్డకిచ్చే పాలు తక్కువగా వస్తాయి. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించి బిడ్డకు సరిపడ పాలను ఇవ్వొచ్చు.
 బిడ్డకు పాలు సమృద్ధిగా అందాలంటే తల్లి బలమైన పోషక ఆహారం తీసుకోవాలి. మంచి ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఐరన్ కల ఆహారం తినాలి. ప్రొటీన్లు ఎక్కువగా లభ్యమయ్యే పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని మసాలాలు లేని ఆహారం తీసుకోవాలి. అందులో కంపల్సరీ ఆవిరి మీద ఉడికించిన వాటిని తీసుకోవడం వల్ల కాస్త మెరుగైన బ్రెస్ట్ సప్లై ఉంటుంది.
 
అదేవిధంగా విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్, గుమ్మడి వంటి కాయకూరలు తినాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఉడికించిన బఠాణీలు, బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పోలెట్ అధికంగా లభ్యమయ్యే ఆకు కూరలు ఎక్కువగా తినాలి. పండ్లు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా తల్లి నుంచి బిడ్డకు కావలసినన్ని పాలు చిక్కుతాయి. 

బిడ్డకు పాలిచ్చే తల్లులు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, తీసుకోరాదు. వారి కోసం వండే ఆహార పదార్థాల్లో మసాలాలు తగ్గించి, సువాసననిచ్చే కొత్తమీర, దాల్చిన చెక్క ఉపయోగించరాదు. ఇటువంటివి వాడితే ఆ సువాసన ఘాటు బిడ్డకు ఇచ్చే తల్లిపాల రుచిని మారుస్తుంది. తద్వారా బిడ్డ పాల సరిపడినన్నితాగలేదు.

ముఖ్యంగా బిడ్డకు పాలిచ్చే మహిళలు మద్యం సేవించడం, పొగాకు తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి పాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి ప్రభావం బిడ్డపై పడే ప్రమాదం లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాల్సిందే. తల్లి వేర్లు అయితే పిల్లలు మొక్కలు ...మీరేం ఇస్తారో వారు అలానే పెరుగుతారు. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకొని పిల్లలకు పాలివ్వండి. అది వారి ఆరోగ్యానికి చాలా మంచిది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu healthy-food-habits kids mother milk-feeding

Related Articles