karithika masam: కార్తికమాసం స్పెషల్​ - అరుణాచలం TO తంజావూర్ !

దీపావళి దాటితే కార్తీకమాసమే. ఈ మాసంలో చాలా మంది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు.


Published Oct 22, 2024 07:38:00 PM
postImages/2024-10-22/1729606125_mostastoundingtemple.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి దాటితే కార్తీకమాసమే. ఈ మాసంలో చాలా మంది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటారు. అసలు ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రిప్ డీటైల్స్ చూసేద్దాం. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​​ అండ్​​ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. 


భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా కార్తిక మాసం స్పెషల్​గా ఐఆర్​సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. తొమ్మిది రోజులు ట్రిప్ డీటైల్స్ చూసేద్దాం.తొమ్మిది రోజులు అరుణాచలం నుంచి తంజావూర్ కు ట్రిప్ ప్లాన్ చేసింది ఇండియన్ రైల్వే. ఈ ట్రిప్ నవంబర్ 6వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.


* మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్​ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ స్టార్ట్​ అవుతుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడ నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్ కు వెళ్తారు. 


* మూడో రోజు ఉదయం కుదాల్​నగర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. 


*నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మధురై స్టార్ట్​ అవుతారు.

సాయంత్రం మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. 
* ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. 
*ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కన్యాకుమారి రైల్వే స్టేషన్​కు చేరుకుని అక్కడి నుంచి కొచ్చువేలికి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి మీరు బీచ్ ..తమిళనాడు స్పెషల్ అట్రాక్షన్స్ ను చూడొచ్చు.


*ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్​లో ఫ్రెషప్​ అనంతరం శ్రీరంగం టెంపుల్​ దర్శించుకుంటారు. ఇక్కడి తో ట్రిప్ క్లోజ్ అయిపోతుంది. 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్​, మహబూబాబాద్​, వరంగల్​, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.


 వీటి కోసం పెద్దలకు 14250 స్లీపర్ .. అదే థర్డ్ ఏసీ 21900 ..ఇదే సెకండ్ ఏసీ అయితే 28500 టికెట్లు ఉంటాయి. అయితే మరిన్ని వివరాలకు ఇండియన్ రైల్వే యాప్ డీటైల్స్ తీసుకోవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department devotional

Related Articles