Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలా.? ఈ టిప్స్ మీకు సాయం చేస్తాయి !

బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు సైతం ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితికి సైతం దారి తీస్తుంది


Published Oct 21, 2024 06:09:00 PM
postImages/2024-10-21/1729514428_badcholesterol116898433891725802919.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా చెబు కొలస్ట్రాల్ బాధ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ చెడు కొలస్ట్రాల్ కారణంగా గుండె ఆరోగ్యం 40 ఏళ్లకే ఆగిపోతుంది.బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు సైతం ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితికి సైతం దారి తీస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏ ఆహారం వల్ల చెడు కొలస్ట్రాల్ కలిగాయో...అదే ఆహారం తో వాటిని కరిగించాయి.


 * బచ్చలి కూరను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు పచ్చని కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ధమనుల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగించేస్తుంది. క్రమం తప్పకుండా బచ్చలి కూరను తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.


* వెల్లుల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తరిమికొట్టడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వెల్లుల్లి చాలా ఈజీగా చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పొద్దున్నే తింటే ఇంకా మంచిది.


* చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బ్రోకలీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. బ్రోకలీ అయితే శరీరంలో ఉండే చక్కెర స్థాయిను కూడా కంట్రోల్ చేస్తుంది.


 * క్యారెట్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాలను పూర్తిగా తగ్గిస్తుంది, దమనుల్లో ఎలాంటి కొవ్వు అడ్డు రాకుండా చేస్తుంది.
 * శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బెండకాయ కూడా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా బెండకాయ తీసుకోవడం వల్ల గుండె ధమనుల్లో తలెత్తే సమస్యలు దూరమవుతాయి. 
 

newsline-whatsapp-channel
Tags : food-habits healthy-food-habits heart-attack heart-problems fatyacids

Related Articles