గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది మరి మెగ్నిషియం డెఫిషియన్సీ కి ఏం చెయ్యాలి. ఏం చెయ్యలో చూసేద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : శరీరానికి సరిపడా మెగ్నీషియం లభించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా తక్కువ మందికే తెలుసు. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది మరి మెగ్నిషియం డెఫిషియన్సీ కి ఏం చెయ్యాలి. ఏం చెయ్యలో చూసేద్దాం.
ఇది గుండె లయ, కండరాల సంకోచం, రక్తపోటు నియంత్రణ, ఎముకల బలాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సుమారు 300కిపైగా శారీరక క్రియల్లో మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి రోజుకు 310 మి.గ్రా నుంచి 420 మి.గ్రా. మెగ్నీషియం అవసరపడుతుంది. కాని దీనిపై ఎక్కువ ఫోకస్ చెయ్యరు.
* 30 గ్రాముల బాదంలో 80 మి.గ్రా. మెగ్నీషియం ఉంటుంది. అలాగే 30 గ్రాముల జీడిపప్పు – 72 మి.గ్రా, 30 గ్రాముల వేరుశనగలో 49 మి.గ్రా, 30 గ్రాముల గుమ్మడి గింజల్లో 150 మి.గ్రా, 1 చెంచాడు అవిసె గింజల్లో 40 మి.గ్రా, అరకప్పు మొక్కజొన్న గింజలు – 27 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది.
*అరకప్పు ఉడికించిన శనగల్లో 60 మి.గ్రా మెగ్నీషియం లభిస్తోంది. వీటితోపాటు కంది, పెసర, మినప, శనగ పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.
* పాలు, పెరుగులో క్యాల్షియంతో పాటు మెగ్నీషియం లభిస్తుంది. 1 కప్పు పాలలో 27 మి.గ్రా, పావు కిలో పెరుగు – 42 మి.గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.
ఆకు కూరలు, కూరగాయల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అరకప్పు ఉడికించిన పాలకూర – 78 మి.గ్రా, అరకప్పు బఠానీలు 31 మి.గ్రా, అరకప్పు బంగాళాదుంపలు – 48 మి.గ్రా మెగ్నీషియం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మెగ్నిషియం తక్కువ అయితే మనిషికి ఎముకల బలం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. అంతేకాదు డిప్రెషన్ కూడా కలుగుతుంది. కాబట్టి మెగ్నిషియం కూడా మనిషి శరీరానికి చాలా అవసరం.