ప్రస్తుతం తమిళంతో రెండు సినిమాలు, హిందీలో ఒక చిత్రంలో నటిస్తోంది. తాజాగా షాహిద్ కపూర్‌తో నటించిన దేవా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 2014లో వచ్చిన 'ఒక లైలా కోసం' మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. 2014లో వచ్చిన 'ఒక లైలా కోసం' మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే కు కోపం వచ్చింది. అసలు నా గురించి ఇలా ఎలా మాట్లాడతారంటూ ఫుల్ గుస్సా అయ్యింది.
ప్రస్తుతం తమిళంతో రెండు సినిమాలు, హిందీలో ఒక చిత్రంలో నటిస్తోంది. తాజాగా షాహిద్ కపూర్‌తో నటించిన దేవా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్.. ‘సల్మాన్, హృతిక్, రణ్‌వీర్, షాహిద్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని మీరు అదృష్టంగా భావిస్తారా? అసలు అందుకు మీరు అర్హులేనా? అని అడిగారు. ఈ క్వశ్చన్ లో అడగగానే ...పూజా కు కోపం వచ్చింది. ఎస్ నేను డిసర్వ్డ్ క్యాండిడేట్ . నిజంగా లక్ వల్ల నాకు అవకాశాలు వచ్చాయని మీరు అనుకుంటే నేను ఏ మాత్రం బాధపడను. అని తెలిపింది.
ఏ పాత్ర కైనా న్యాయం చేస్తున్నా..ఎప్పుడు చేస్తా. అదే అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. ఇక 'మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల సినిమాలైతేనే చేస్తారా'? అని మరో విలేకరి ప్రశ్నించగా.. బుట్టబొమ్మకు కోపం వచ్చింది .. ‘అసలు మీ సమస్య ఏంటి?’ అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన షాహిద్ కపూర్ తన జోకులతో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా చేశారు.