కుటుంబాలు ఉన్న రోజుల్లో అందరూ పక్కన ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవారు. అప్పటి వారికి మెంటల్ టెన్షన్ తెలీదు. ఇప్పుడు అది తప్ప మరొకటి లేదు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: డెలివరీ కి ఇంత కష్టపడాలా ఏంటి..మా రోజుల్లో పది మంది పిల్లల్ని కనేవాళ్లం. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. అయితే ఈ రోజుల్లో పిల్లలు కలగడమే చాలా అదృష్టం అనేలా ఉంది పరిస్థితి. కొన్ని వేల జంటలు హాస్పటల్స్ చుట్టు తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి నెల చాలా అపురూపంగానే చూసుకోవాలి. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో అందరూ పక్కన ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవారు. అప్పటి వారికి మెంటల్ టెన్షన్ తెలీదు. ఇప్పుడు అది తప్ప మరొకటి లేదు.
* వంతులు వేసుకోకండి...మీ భార్యకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. తను యాక్టివ్ గా ఉండడానికి మీ తెలిసిన చిన్న చిన్న ఆటలు ఆడండి.
* మీ ఆఫీస్ అయిపోయాక ...మీ పూర్తి టైంను మీ భార్యకే కేటాయించండి. మీరు పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు . చక్కగా కబుర్లు చెప్పండి. ఆర్ధికంగా మీరు ఎంత బాగున్నా ..మీరు తోడు లేకపోతే వారు హ్యాపీ గా ఉండలేరు.
* ప్రతి చెకప్ కు మీరు తోడు వెళ్లండి. బేబీ మూవ్ మెంట్స్ ఎలా ఉన్నాయో...హెల్దీ ఫుడ్స్ తినడానికి మీరే ప్రోత్సహించండి.
* నెలలు నిండుతున్న కొద్దీ ఎక్కువ ఇబ్బందులు వస్తుంటాయి. కాస్త కాళ్లు నొక్కడం ...బాడీ మసాజ్ ఇవ్వండి . తనతో పాటు మీరు వాకింగ్ కు వెళ్లండి.
* తను ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి మీరు సాయం చెయ్యండి.
*7 వ నెల నుంచి కాస్త చిన్నచిన్న ఎక్సర్ సైజులు చేసేలా చూడండి. అప్పుడు సునాయసంగా నార్మల్ డెలివరీ అవుతుంది.