గుడ్డులా తినడానికి ..ఆమ్లెట్ తినడానికి చాలా తేడా ఉంది. అయితే ఉడకించిన గుడ్డు , ఆమ్లెట్ ఏది బెస్ట్ అనేది చూద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గుడ్డు సంపూర్ణ పోషకాహారం ఇది . గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం మనందరికి తెలిసిందే . ఇందులో ప్రొటీన్, అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్‌తో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది ఆమ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కాని గుడ్డులా తినడానికి ..ఆమ్లెట్ తినడానికి చాలా తేడా ఉంది. అయితే ఉడకించిన గుడ్డు , ఆమ్లెట్ ఏది బెస్ట్ అనేది చూద్దాం.
ఉడికించిన గుడ్డు ఇది కండరాలు అభివృద్ధికి చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే, దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌తో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరు గ్రాముల మంచి ప్రొటీన్ ఉంటుంది. దీని వల్ల మీ శరీరంలో చాలా మంచి హెల్దీ ప్రొటీన్ అందుతుంది. వెయిట్ కంట్రోల్ చేయడానికి ఉడికించిన గుడ్డు బెస్ట్.
ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా మంది పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయలను యాడ్ చేస్తారు. నూనె, చీజ్ వంటివి కలపడం వల్ల కేలరీలు పెరగడంతో పాటు అనారోగ్యకరమైన కొవ్వులు యాడ్ అవుతాయి. క్యాలరీలు పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యం చాలా డేంజర్ లో పడుతుంది. బరువు తగ్గాలంటే ...ఉడికించిన గుడ్డు. పోషకాలు కావాలంటే ఆమ్లెట్ తీసుకొండి.