WIGHT LOSS: బరువు తగ్గడానికి ఇదే బెస్ట్ ఆప్షన్..ఫాస్ట్ గా బరువుతగ్గాలంటే ..?

శరీరంలో అధిక కొవ్వు కారణంగా టైప్- 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని వెల్లడైంది. 


Published Nov 08, 2024 02:35:00 PM
postImages/2024-11-08/1731056995_file2024110717bbgd5e.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. బరువుతోనే బోలెడు రోగాలు. ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరు ఒబెసిటీతో బాధపడుతున్నారు.  ప్రపంచంలో  ఈ సమస్య ఒక్క భారతీయులకే కాదు...అన్ని దేశాల్లోను ఇదే జరుగుతుంది. అయితే  శరీరంలో అధిక కొవ్వు కారణంగా టైప్- 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని వెల్లడైంది. 


అయితే బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కాని ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ . అయితే బరువు తగ్గడానికి కొంతమంది ఉపవాసాలు. టైమింగ్ ఫాస్టింగ్, స్కిప్పింగ్ ఫాస్ట్ ఇలా చాలా చేస్తుంటారు. అయితే ఇందులో ఏది మంచిదో చూద్దాం. 


ఎప్పుడో పెద్దలు చెప్పినట్లు ..భోజనం ఎప్పుడు పొద్దున్న బాగా దనవంతుడులాగా..అంటే మీకు నచ్చినంత...నచ్చనట్లు తినొచ్చు...మధ్యాహ్నం ...మిడిల్ క్లాస్ వాళ్లలాగా...కాస్త పొట్ట నిండి నిండనట్లు తింటే చాలు...రాత్రి పేదవాడి భోజనం చేస్తే ఆరోగ్యం గా ఉంటారని చెబుతుంటారు. పేదవాడి భోజనం ఏంటి అంటారేమో..ఉంటే తింటారు ...లేదంటే కాస్త పాలు తాగి పడుకుంటారు అలా...చాలా లైట్ గా తింటే బాగుంటుంది. ఇఫ్పుడు అధిక బరువుకు ప్రధానం కారణం మనం బ్రేక్ ఫాస్ట్ చాలా లైట్ గా ఇడ్లీలు తిని ...మధ్యాహ్నం ఆఫీసులకు చిన్న చిన్న లంచ్ బాక్స్ తిని ...రాత్రికి మాత్రం ప్రశాంతంగా బిర్యానీ తింటుంటాం. లేదా హెవీ క్యాలరీల ఫుడ్ తింటాం..ఇది 1000 శాతం తప్పుడు పధ్ధతి. తక్కువ క్యాలరీలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. పొద్దున్న బాగా తిని..రాత్రికి ఫుడ్ తగ్గించడం వల్ల బాగా బరువుతగ్గుతారట. ట్రై చెయ్యండి.
 

newsline-whatsapp-channel
Tags : health-benifits healthy-food-habits weight-loss

Related Articles