రిలేషన్ షిప్ట్స్ ను ప్రోత్సహించేందుకు గాను యూత్ ఫస్ట్ డేట్ కు గవర్నమెంట్ డబ్బులిస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అన్ని దేశాల్లోను యూత్ తగ్గిపోయారు... వయోభారంతో ఉన్నవారు ఎక్కువవుతున్నారని బాధపడే దేశాలు ఎక్కువవుతున్నాయి. అందుకే రష్యా లాంటి దేశాలయితే ఏకంగా మాస్టర్ ప్లాన్ వేశారు పుతిన్. జననాల రేటును పెంచే కార్యక్రమాలన్ని ఈ శాఖ పరిధిలో ఉంచాలంటూ కొన్ని సూచనలు చేసింది. రిలేషన్ షిప్ట్స్ ను ప్రోత్సహించేందుకు గాను యూత్ ఫస్ట్ డేట్ కు గవర్నమెంట్ డబ్బులిస్తుంది.
ఫస్ట్ డేట్‌కు 5000 రూబెల్స్ ఇవ్వాలని సూచనలు ఇచ్చింది. ఇంటిపనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకునేవారికి కొంతమొత్తం చెల్లించాలని సలహా ఇచ్చింది. అంతేకాదు ..పిల్లల్ని కనడానికి ప్రత్యేకమైన సెలవులు కూడా ఇస్తుంది.ఈ జననాల రేటును పెంచడం కోసం మహిళల వ్యక్తిగత వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు పలు వార్తలు వచ్చాయి.
గవర్నమెంట్ లెక్కల ప్రకారం- రష్యాలో ఈ సంవత్సరంలో జూన్ వరకు 5,99,600 మంది పిల్లలు జన్మించారు. 2023 జూన్‌తో పోలిస్తే దాదాపు 16,000 పిల్లలు తక్కువ. 1999 నుంచి జననాల రేటులో తగ్గుదల నమోదవుతోంది. మరోవైపు, 2024 జనవరి నుంచి జూన్ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయి. ఇలా ప్రతి యేడాది ...జననాల రేట్లు చాలా దారుణంగా తగ్గిందని ఇది అస్సలు మంచిది కాదని రష్యా గవర్నమెంట్ అభిప్రాయపడుతుంది.
పది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ (రూ.13లక్షలకుపైగా) నజరానా ఇస్తారు. 'మదర్ హీరోయిన్' అవార్డును కూడా ఇస్తామని పుతిన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. పది మంది పిల్లలు కాని ఉంటే పదోబిడ్డ మొదటి బర్త్ డే కి ఈ నగదును చెల్లిస్తామని క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు తమకు పుట్టిన 10 మంది బ్రతికి ఉంటేనే ఈ నజరానా దక్కుతుందని కూడా చెప్పింది.