సరిగ్గా వెతికితే హోటల్ లో కాస్తో కూస్తో హెల్దీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాస్త వెతకాలి అంతే. మీరు కష్టపడకుండా మేమే వెతికి చెప్పేస్తాం ..చూసేయండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొన్ని సార్లు ఎంత ఆరోగ్యంగా ఉండాలని ట్రై చెయ్యాలనుకున్నా కొన్ని సార్లు తప్పక బయట ఫుడ్స్ తినాల్సి వస్తుంది. తప్పక తింటారు. కాని హోటల్ కు వెళ్తే హెల్దీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాని మనం వెతకం...మెనూ కనిపిస్తే చాలు .. చక్కగా బాగా నూనెలో వేగే వస్తువలు వెతుక్కొని మరీ ఆర్డర్ చేస్తాం కాని ...సరిగ్గా వెతికితే హోటల్ లో కాస్తో కూస్తో హెల్దీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాస్త వెతకాలి అంతే. మీరు కష్టపడకుండా మేమే వెతికి చెప్పేస్తాం ..చూసేయండి.
* ఉడికించినవి ....మోమోలు ..ఉడికించిన కూరగాయలు..స్ట్రీమ్ లో చేసిన ఏ వస్తువైనా ...మీరు ఆలోచించకుండా తినచ్చు.
* కూల్ డ్రింక్స్ కి బదులుగా ...చక్కగా ..ఐస్ , ఫుడ్ కలర్స్ , ఎక్కువ చక్కర లేకుండా లస్సీ తీసుకొండి.
* మీరు తప్పక మీల్ తీసుకోవాలంటే ...చపాతీ ఎక్కువ ఆయిల్ లేకుండా ...తీసుకొండి. దీనిలోకి చికెన్ కూర్మాలు తీసుకొండి. చెప్పండి చెఫ్ కు ఎక్కువ ఆయిల్ వద్దు ...ఎక్కువ కారం వద్దు ఉప్పు తగ్గించాలి..లాంటివి చెప్పి చేయించుకొండి.
* మీరు హెల్దీ గా ఉండాలనుకుంటే ..అసలు డబ్బులు కోసం చూడకుండా...సలాడ్స్ తీసుకొండి. అందులో అడ్డమైన చెత్త వెయ్యకుండా ...లైట్ గా సాల్ట్ ..మసాలా పొడి వేసుకొని తినండి. చాలా హెల్దీ.
* పిల్లలకు అయితే చియా సీడ్స్ తో చేసిన ఫుడ్ కలర్స్ లేని సూపర్ కూల్ కాక్ టైల్ చెయ్యమనండి. ఇందులో మీరు ఫుడ్ కలర్స్ లేని ఫ్లేవర్స్ వెతుక్కొండి. నో డౌట్ లెమన్ తీసుకొండి. ఇలా ప్రయత్నిస్తే చాలా ఉంటాయి. బాగా చూసుకొండి వెతకాలి...వెతికితే దొరకనిదంటూ ఏది లేదు...ట్రై హెల్దీ ....ఈట్ హెల్దీ.