AP Tourism : కార్తీకమాసంలో ఈ ప్లేస్ కు వెళ్లండి థ్రిల్లింగ్ గా ఉంటుంది !

ఈ శివలింగం విశ్వామిత్రుడు స్థాపించిన లింగం ..అంతేకాదు ఇక్కడ శివుడు ఎండ్రకాయ రూపంలో ఎప్పుడు భక్తులకు దర్శనమిస్తాడు.


Published Nov 10, 2024 06:46:15 AM
postImages/2024-11-10/1731242381_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అందమైన జలపాతాలు , ప్రకృతి సోయగాల మధ్య అత్యంత మహిమాన్వితమైన శివక్షేత్రం  కడప లో ఉంది. చక్కని జలపాతంతో  చక్కగా ఎంజాయ్ చెయ్యొచ్చు.కడప జిల్లా చిట్వేలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. ఇది గుండాలకోనలో ఉంది. ఇక్కడ గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. నిజానికి ఈ శివలింగం విశ్వామిత్రుడు స్థాపించిన లింగం ..అంతేకాదు ఇక్కడ శివుడు ఎండ్రకాయ రూపంలో ఎప్పుడు భక్తులకు దర్శనమిస్తాడు.


 విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎండ్రకాయకు గుహ ద్వారంలో పండ్లు, ఫలాలు పెడతారు. ఎండ్రకాయ ఆ ఫలాన్ని తీసుకొని వెళ్తే ...మీ కోరిక తీరుతుంది. లేదంటే కోరిక తీరడం లేటవుతుంది. ఇక్కడ గుండంలో మునిగి స్వామి  వారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీతి.


ప్రత్యేకించి 3వ సోమవారం ఎక్కువ మంది వెళుతుంటారు. గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉండటం విశేషం. కాని స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి 9 కిలోమీటర్లు అడవి బాటలో వెళ్లాలి. ఇక్కడకి వెళ్లాలంటే కంపల్సరీగా అటవీ శాఖ పర్మిషన్స్ కావాల్సిందే.మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇఫ్పుడు వెళ్లాలనుకుంటే సాహసవంతులు ప్రయత్నించొచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shivalayam kadapa gundala-kona

Related Articles