NATIONAL : ఏం తెలివిరా నాయనా...ఆన్ లైన్ లో చూసి ..గంజాయి పెంచుతున్న వ్యక్తి !

రాహుల్ చౌదరి ఆరు నెలలుగా 10వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్‌లో ఆధునిక వ్యవసాయ విధానంతో గంజాయిని పెంచుతున్నాడు. 


Published Nov 13, 2024 06:28:00 PM
postImages/2024-11-13/1731502784_grownganjainflat.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వెబ్ సీరిస్ చూసి ఇంట్లోనే గంజాయి పెంపకం ..ఆన్ లైన్లో అమ్మి లక్షలు సంపాదించిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం. గ్రేటర్ నోయిడాలోని పార్శ్వనాథ్ పనోరమా సొసైటీలోని ఓ ఫ్లాట్‌‌లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రాహుల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్ జిల్లాకు చెందిన రాహుల్ చౌదరి ఆరు నెలలుగా 10వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్‌లో ఆధునిక వ్యవసాయ విధానంతో గంజాయిని పెంచుతున్నాడు. 


దానిని హైటెక్ విధానంలో అమ్ముతున్నాడు కూడా. ఈ డార్క్ వెబ్ ద్వారా క్లయింట్స్ ని పరిచయం చేసుకొని వారికి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేసేవాడు. రాహుల్ చౌదరి ఇటీవల వెబ్ సీరీస్ లు చూసి గంజాయి సాగు చేయడం.. ఎలా అమ్మాలో అన్న విషయం గురించి నేర్చుకున్నాడు. పక్కా పథకం ప్రకారం వాటిని ఆన్ లైన్ లో అమ్మేస్తున్నాడు.


రాహుల్ చేస్తున్న దందా గురించి పోలీసులకు సమాచారం అందింది. పక్కా పథకం ప్రకారం రైడ్ చేసి 2 కిలోల కన్నా ఎక్కువగా గంజాయి, 163.4 గ్రాముల ఓషన్ గంజాయి అంటే ప్రీమియం గంజాయితో పాటు వ్యవసాయ సామగ్రి, కొన్ని రకాల కెమికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆరు నెలల్లో  పైగా మొక్కలు పెంచాడు. వాటిలో ఇప్పటి వరకు మొక్కులు అమ్మి రూ. 12లక్షల వరకు సంపాదించినట్లు పోలీసుల విచారణ లో తెలిపాడు. దీని తర్వాత దాదాపు 80 మొక్కలకు ఆర్డర్ వచ్చిందని.. వీటి ధర రూ.48 లక్షలు ఉంటుందని పోలీసులకు తెలిపాడు.


ఓ విదేశీ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా గంజాయి మొక్క విత్తనాలను కొనుగోలు చేసినట్లు రాహుల్ తెలిపాడు. ఒక్కొక్క మొక్క 30 నుంచి 40 గ్రాముల OG ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని ఈ దందాలోకి దిగినట్లు రాహుల్ తెలిపాడు. గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియా ఖాన్ తెలిపారు. నిందితుడికి సంబంధించి లింకులు, నెట్‌వర్క్‌పై కూడా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries

Related Articles