Lord Rama Bank: రాముడి కోసం ప్రత్యేక బ్యాంకు...ఏం చెయ్యాలి

ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్( SEETHA RAM BANK). రాముడి నగరంలోని ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే సీతారాం( SEETHA RAM) అని 5 లక్షల సార్లు రాయాలి. అయితే ఈ బ్యాంకు ఈ రోజు ...ఈ ఏడాది మొదలైంది కాదు ...1970 సంవత్సరంలో స్థాపించబడింది.ఈ బ్యాంకులో 35,000 మంది ఖాతాదారులు ఉన్నారు.


Published Jun 25, 2024 09:04:13 PM
postImages/2024-06-25/1719329653_AccountonlyifyouwriteSitaram5lakhtimesFulldetail.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శ్రీరామునికి ( SRI RAM) ఓ ప్రత్యేక బ్యాంకు ఉంది. ఈ బ్యాంకుకు ప్రతి భక్తుడు ఖాతాదారుడే. అయితే ఖాతా తెరవాలంటే మాత్రం ఓ చిన్న పని చేయాల్సిందే.ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్( SEETHA RAM BANK). రాముడి నగరంలోని ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే సీతారాం( SEETHA RAM) అని 5 లక్షల సార్లు రాయాలి. అయితే ఈ బ్యాంకు ఈ రోజు ...ఈ ఏడాది మొదలైంది కాదు ...1970 సంవత్సరంలో స్థాపించబడింది.ఈ బ్యాంకులో 35,000 మంది ఖాతాదారులు ఉన్నారు.  ఈ బ్యాంకుకు అమెరికా, బ్రిటన్, కెనడా, నేపాల్, ఫిజీ, యుఎఇ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఖాతాదారులుగా ఉన్నారు.


రామ జన్మ భూమిలో నిర్మించిన ఈ బ్యాంకు భక్తుల నుంచి స్వీకరించిన 20,0000 కోట్ల సీతారాముల బుక్‌లెట్లను కలిగి ఉంది. అయోధ్యలో(AYODHYA) రామ మందిరాన్ని ప్రతిష్టించిన ప్రయోజనం కూడా ఈ బ్యాంకుకే దక్కింది. ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ బ్యాంకు మేనేజర్ తెలిపారు. అయోధ్య మందిరం పూర్తయిన తర్వాత స్వామివారిని చేరుకొనే మార్గం సులభతరమైంది. ఈ బ్యాంక్ ప్రతి ఖాతాను ట్రాక్ చేస్తుంది. బ్యాంక్ తన ఖాతాదారులందరికీ ఉచిత బుక్‌లెట్, రెడ్ పెన్ను బహుమతిగా ఇస్తుంది. ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే బుక్‌లెట్‌పై సీతారాం అని 5 లక్షల సార్లు రాయాలి. అప్పుడే మీ ఖాతా తెరిచి పాస్‌బుక్ జారీ చేస్తారు. ఈ బ్యాంక్ దేశంలో,  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 136 శాఖలను కలిగి ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles