ఇండస్ట్రీలో ఇఫ్పుడు నాగచైతన్య, శోభిత పెళ్లే హాట్ టాపిక్. ఎంగేజ్ మెంట్ సైలెంట్ గా అయిపోయింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీలో ఇఫ్పుడు నాగచైతన్య, శోభిత పెళ్లే హాట్ టాపిక్. ఎంగేజ్ మెంట్ సైలెంట్ గా అయిపోయింది. ఇప్పుడు పెళ్లి పై మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగుతుంది.ఈనెల ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబ సభ్యులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. రీసెంట్ గా చైతన్య,శోభితల పెళ్లి మార్చి లో అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.
వచ్చే ఏడాది 2025 మార్చిలో కానీ గ్రాండ్ గా రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా జరుగుతుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.. కాకపోతే నాగ చైతన్య, శోభిత సినిమా కాల్షీట్స్ తో పాటు సినిమా ఫ్యామిలీ అందరికి కాల్షీట్స్ అందుబాటులో ఉన్నపుడే పెళ్లి పనులు మొదలవుతాయని అంటున్నారు. మరో ఆరు నెలలో ఈ లవ్ బర్డ్స్ మూడు ముళ్ల బంధంతో ఒకటవుతారట.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం నాగ చైతన్య తాండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా, ఈ సినిమాను చందు మోండేటి తెరకెక్కించానున్నారు.ఈ మూవీని చందుమొండేటి దర్శకత్వం చేస్తున్నారు. జాలరి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. రిలీజ్ డేట్ పైమాత్రం క్లారిటీ లేదు. ఇంకా vfx కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామంటున్నారు మూవీ టీం.