TELANGANA : ఒకేరోజు పంచారామాల దర్శనం - ధర కూడా తక్కువే!

ఒకే రోజు దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అసలు టికెట్ ధర ఎంతో ఏంటో తెలుసుకుందాం.


Published Nov 27, 2024 07:52:00 PM
postImages/2024-11-27/1732717435_panc.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అతితక్కువ ధరకు పంచారామాలు యాత్రను వేస్తుంది తెలంగాణ టూరిజం . పంచారామక్షేత్రాలు ఒకే రోజు దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలుగుతాయని నమ్మకం. ఆంధ్రప్రదేశ్​లో ప్రసిద్ధి చెందిన పంచారామాలను దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. ఎందుకంటే పంచారామ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అసలు టికెట్ ధర ఎంతో ఏంటో తెలుసుకుందాం.


పంచారామాలను దర్శించుకోవడానికి తెలంగాణ టూరిజం పంచారామం టెంపుల్స్​ టూర్​ పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది.  ఈ టూర్ మూడు రోజులు ..అమరావతి, పాలకొల్లు , భీమవరం , ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలు చూడొచ్చు. ప్రతి సోమవారం ఈ టూర్ ఉంటుందని తెలిపారు.


* మొదటి రోజు రాత్రి 9 గంటలకు ఐఆర్​ఓ యాత్రి నివాస్​ నుంచి, 9.30 గంటలకు CRO బషీర్​బాగ్ నుంచి బస్సు ద్వారా జర్నీ స్టార్ట్​ అవుతుంది. 


* రెండో రోజు ​ఉదయం 5 గంటలకు అమరావతి చేరుకుంటారు. అక్కడ హోటల్లో ఫ్రెషప్​ అనంతరం అమరావతిలోని అమరేశ్వరుడిని దర్శించుకుంటారు.


* రామలింగేశ్వరుడు తర్వాత భీమవరంలోని సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ద్రాక్షారామాన్ని, సామర్లకోటలోని శివలింగాన్ని దర్శించుకుంటారు.


మూడో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.


టికెట్ ధర పెద్దలకు రూ.4,999, చిన్నారులకు రూ.3,999 చెల్లించాలి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shiva pancharamalu bheemavaram bheemalingeswarudu

Related Articles