Keerthy Suresh: అవును ..నా పెళ్లి వార్త నిజమే..కీర్తి అఫిషియల్ ట్వీట్ !

స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు కీర్తి సురేశ్ . 


Published Nov 27, 2024 01:09:00 PM
postImages/2024-11-27/1732693212_keerthisuresh.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎక్కడ డచూడు ఇదే మాట మహానటి పెళ్లి  వార్తే. ఆఖరికి కీర్తినే ట్వీట్ చేసేసింది. అవును రా బాబు నా పెళ్లి నిజమే ...మీ ఊహాలు ఇక ఆపేయండంటూ డీటైల్ గా పోస్ట్ చేసింది. స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు కీర్తి సురేశ్ . 


దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో దిగిన ఫొటోను షేర్ చేసిన కీర్తి.. తమ 15 ఏళ్ల బంధం ఇక జీవితాంతం కొనసాగుతుందని పేర్కొన్నారు. తన ట్వీట్ పై సెలబ్రెటీస్ వెంటనే స్పందిస్తూ కంగ్రాట్స్ తెలుపుతున్నారు. తనకు ఇప్పుడే తెలిసిందని కంగ్రాట్స్  లవ్ అంటూ నటి రాశీ ఖన్నా స్పందించింది. అభిమానులు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.


ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆంటోనీ కొంతకాలం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాడు. కేరళలో అతడికి పలు వ్యాపారాలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని చూసుకుంటున్నట్టు తెలిసింది. ఇరు కుటుంబాల సమక్షంలో పెద్దల అంగీకారంతోనే ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ కీర్తి సురేశ్ ఈ అధికారిక ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు కెరియర్ పీక్ ఉన్నపుడే పెళ్లి చేసుకోవడంపై కాస్త షాక్ అయినా ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding goa keerthysuresh

Related Articles